Director Vamsee: పెళ్లిపీటలెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ దర్శకుడు.. వధువు ఎవరో తెలుసా?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ కృష్ణ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ప్రమీల అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. బుధవారం (ఆగస్టు 28) వీరి వివాహం వేడుకగా జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

Director Vamsee: పెళ్లిపీటలెక్కిన 'టైగర్ నాగేశ్వరరావు' దర్శకుడు.. వధువు ఎవరో తెలుసా?
Director Vamsee
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2024 | 6:37 PM

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ కృష్ణ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. ప్రమీల అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. బుధవారం (ఆగస్టు 28) వీరి వివాహం వేడుకగా జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచిప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. డైరెక్టర్ వంశీకృష్ణ పెళ్లికి సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వంశీ కృష్ణ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ వంశీ. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ టైటిల్ రోల్‌లో నటించారు.అలాగే అనుపమ్ ఖేర్ , జిషు సేన్‌గుప్తా , నూపుర్ సనన్, రేణు దేశాయ్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, ప్రదీప్ రావత్, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. భారీ అంచనాలతో గతేడాది దసరా కానుకగా రిలీజైన టైగర్ నాగేశ్వర రావు మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే డైరెక్షన్ టేకింగ్ బాగుందని ప్రశంసలు వచ్చాయి. దీనికంటే ముందు దొంగాట సినిమాను తెరకెక్కించాడు. వంశీ కృష్ణ. ఇందులో అడివి శేష్‌, లక్ష్మీ మంచు కీలక పాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ వంశీ పెళ్లి వేడుకలో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్

టైగర్ నాగేశ్వర రావు సెట్ లో రవితేజతో డైరెక్టర్ వంశీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.