AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ స్పోర్ట్స్ యాంకర్‌ను గుర్తు పట్టారా? నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడిన క్రేజీ హీరోయిన్.. ఇప్పుడిలా

ఈ ఫొటోలోని స్పోర్ట్స్ యాంకర్ ను గుర్తు పట్టారా? ఈ అందాల తార ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ హీరోయిన్ గా ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది. అందుకే ఇప్పుడిలా స్పోర్ట్స్ యాంకర్ గా అవతారమెత్తింది.

Tollywood: ఈ స్పోర్ట్స్ యాంకర్‌ను గుర్తు పట్టారా? నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడిన క్రేజీ హీరోయిన్.. ఇప్పుడిలా
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 28, 2024 | 6:09 PM

Share

ఈ ఫొటోలోని స్పోర్ట్స్ యాంకర్ ను గుర్తు పట్టారా? ఈ అందాల తార ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ హీరోయిన్ గా ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది. అందుకే ఇప్పుడిలా స్పోర్ట్స్ యాంకర్ గా అవతారమెత్తింది. అయితే ఈ స్పోర్ట్స్ ప్రజెంటర్ గా వ్యవహరించడం ఈ ముద్దుగుమ్మకేమీ కొత్త కాదు. గతంలో పలు ప్రముఖ ఛానెల్స్ లో న్యూస్ అండ్ స్పోర్ట్స్ ప్రజెంటర్ గా వర్క్ చేసింది. అయితే మధ్యలో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంది. మరి ఈ అందాల యాంకరమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు నందమూరి కల్యాణ్ రామ్ సూపర్ హిట్ మూవీ పటాస్ లో హీరోయిన్ గా నటించిన శృతి సోది. ఇందులో రౌడీ ఇన్ స్పెక్టర్ మూవీలోని ‘అరే ఓ సాంబ’ సాంగ్ ను రీమిక్స్ చేయగా తన డ్యాన్సు , స్టెప్పులతో కేక పుట్టించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అనిల్ రావిపూడి- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సుప్రీమ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంలో ప్రియ పాత్రలో మెరిసింది. ఇదే ఆమెకు తెలుగులో చివరి సినిమా.

ఢిల్లీలో పుట్టిన శృతి సోధి ఫిలాసఫీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక.. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. హిందీలో న్యూస్ ఎక్స్ , మరో ఛానల్లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. అదే సమయంలో నటిగా పలు పంజాబీ చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాతే పటాస్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి ప్రస్తుతం స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది.

ఇవి కూడా చదవండి

స్పోర్ట్స్ ప్రజెంటర్ గా పటాస్ హీరోయిన్..

సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నెట్టింట ఆమెకు సుమారు 9 లక్షలకు మందికి పైగా ఫాలో వర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోందీ అందాల తార.

శృతి సోధి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..
కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి