AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sheena: మంచు మనోజ్ బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందా తెలుసా? వేరే లెవెల్ అంతే

వీరూ పోట్ల తెరకెక్కించిన బిందాస్ సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా షీనా షహబాది నటించింది. ముంబయిలో పుట్టి పెరిగినప్పటికీ చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది షీనా. సినిమాలో గిరిజ పాత్రలో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

Actress Sheena: మంచు మనోజ్ బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందా తెలుసా? వేరే లెవెల్ అంతే
Actress Sheena
Basha Shek
|

Updated on: Aug 28, 2024 | 3:07 PM

Share

మంచు మనోజ్ కెరీర్ ప్రారంభంలో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో బిందాస్ ఒకటి. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. 2010లో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మనోజ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. వీరూ పోట్ల తెరకెక్కించిన బిందాస్ సినిమాలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా షీనా షహబాది నటించింది. ముంబయిలో పుట్టి పెరిగినప్పటికీ చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది షీనా. సినిమాలో గిరిజ పాత్రలో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తల్లి బాలీవుడ్ ప్రముఖ నటి సాధనా సింగ్ అడుగు జాడల్లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది షీనా. తేరే సంగ్ అనే హిందీ చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఇక బిందాస్ ఆమెకు తొలి తెలుగు మూవీ. ఈ సినిమా హిట్ కావడంతో షీనాకు అవకాశాలు బాగానే వచ్చాయి. ‘తొలిసారిగా’ , తారక రత్న ‘నందీశ్వరుడు’ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇఅలాగు యాక్షన్ త్రీడీ, నువ్వే నా బంగారం, రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ చిత్రాల్లోనూ మెరిసింది. అయితే ఈ సినిమాలేవీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. దీంతో 2015 తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది షీనా.

సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇండస్ట్రీలోకి రాక ముందే షీనా పెళ్లి చేసుకుంది. 2007లో వైభవ్ గోరే అనే వ్యక్తితో కలిసి ఏడుడుగులు నడిచిందీ అందాల తార. అయితే ఈ మూడు ముళ్ల బంధం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వివాహం, విడాకుల గురించి పలు సందర్భాల్లో స్పందించిన షీనా.. ఇది తన జీవితంలో జరిగిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అక్కడితోనే ఆగిపోకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ బాషా సినిమాల్లోనూ మెరిసింది.

ఇవి కూడా చదవండి

నటి షీనా లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్..

ప్రస్తుతం సినిమాలు చేయనప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గానూ రాణిస్తోంది. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. కాగా అప్పటికీ ఇప్పటికీ షీనా అదే అందం, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బిందాస్ బ్యూటీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

షీనా గ్లామరస్ ఫొటోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే