AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: సూపర్ స్టార్ సినిమాలో కింగ్ నాగార్జున.. లుక్ అదిరిపోయిందిగా..!

నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అందులో హీరో ధనుష్ నటిస్తున్న కుబేర సినిమా ఒకటి. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోనూ నాగ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా కూలీ నుంచి నాగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..

Nagarjuna: సూపర్ స్టార్ సినిమాలో కింగ్ నాగార్జున.. లుక్ అదిరిపోయిందిగా..!
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2024 | 7:12 PM

Share

కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు, పలువురు ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అందులో హీరో ధనుష్ నటిస్తున్న కుబేర సినిమా ఒకటి. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలోనూ నాగ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా కూలీ నుంచి నాగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఇటీవలే  రజనీకాంత్ తన 171వ చిత్రానికి అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కూలీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో ఈ సినిమా పోస్టర్, టైటిల్ టీజర్ విడుదలై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది.

సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా నిన్నటి నుంచి సినిమాలో నటిస్తున్న నటీనటుల పోస్టర్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ నటుడు చౌబిన్ షకీర్ పోస్టర్ నిన్న విడుదలైంది. ప్రస్తుతం రజినీకాంత్ వేటయన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్‌తో రజనీ తన 171వ సినిమా చేస్తారని తెలుస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటులు సత్యరాజ్, మాస్టర్ మహేంద్రన్,  శ్రుతిహాసన్ అలాగే  కన్నడ నటుడు ఉపేంద్ర ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తారని గతంలో కోలీవుడ్ సర్కిల్‌ల్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపధ్యంలో నిన్న 28వ తేదీ నుంచి ఈ సినిమాలో నటించబోయే మరికొంతమంది పోస్టర్స్ ను కూడా విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే మలయాళ నటుడు చౌబిన్ షకీర్ పోస్టర్‌ను విడుదల చేసింది ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. మంజుమ్మల్ బాయ్స్‌లో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు చౌబిన్. ఈ నేపథ్యంలో ఈరోజు టాలీవుడ్  స్టార్ కింగ్ నాగార్జున పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయన సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారు.  ఇక రజినీ వేటయన్ విషయానికొస్తే.. జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తోన్న 170వ సినిమా వేటయన్. జైబీమ్ సినిమా ఫేమ్ టీఎస్ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ తర్వాత మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుపాటి, రితికా సింగ్, తుషార విజయన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. అక్టోబర్ 10న వేటయన్  చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..