AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: షారుఖ్ ఇంటి పక్కన లగ్జరీ విల్లాను కొనేసిన దీపికా పదుకొణె.. ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసి..

బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణెలు మరికొన్ని రోజుల్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపిక ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. సెప్టెంబరులో తనకు బిడ్డ పుట్టబోతున్నట్లు ఇది వరకే వెల్లడించిందీ అందాల తార. అయితే తల్లిదండ్రులు కాక ముందే రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Deepika Padukone: షారుఖ్ ఇంటి పక్కన లగ్జరీ విల్లాను కొనేసిన దీపికా పదుకొణె.. ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసి..
Ranveer Singh, Deepika Padukone
Basha Shek
|

Updated on: Aug 29, 2024 | 6:41 PM

Share

బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణెలు మరికొన్ని రోజుల్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు. దీపిక ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. సెప్టెంబరులో తనకు బిడ్డ పుట్టబోతున్నట్లు ఇది వరకే వెల్లడించిందీ అందాల తార. అయితే తల్లిదండ్రులు కాక ముందే రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇంటి నుంచి షారుఖ్ ఖాన్ ఇంటికి సమీపంలోని రూ.100 కోట్ల ఫ్లాట్‌కి ఈ దంపతులు మారనున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం దీపికా పదుకొణెకు సినీ పరిశ్రమలో డిమాండ్ ఉంది. కోవిడ్ ముగిసిన తర్వాత ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ‘పఠాన్’, ‘జవాన్’, ‘ఫైటర్’ వంటి హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దీపిక తల్లి కావాలని నిర్ణయించుకోవడం చాలా మందిని ఆశ్చర్యానకి గురి చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గర్భం ధరించిన ఆమె వెంటనే ఈ శుభవార్తను అందరితో పంచుకుంది.

సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత అందరూ మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకుంటారు. అయితే దీపికా పదుకొణె మాత్రం అందుకు భిన్నం. ఇప్పటివరకు ఎలాంటి ఫొటో షూట్స్ కు హాజరుకాలేదీ అందాల తార. ఇక రణవీర్ సింగ్, దీపిక ఇటీవల బాంద్రా సమీపంలోని బీచ్‌కు వెళ్లారు. అక్కడ లగ్జరీ విల్లాను కొన్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు. ఇది 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టెర్రస్ కూడా ఉంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఏరియాలోనే నివాసముంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది దీపికా పదుకొనే నటించిన ‘ఫైటర్’ , ‘కల్కి 2898 AD’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వందల కోట్ల వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా ప్రభాస్ తో కలిసి ఆమె నటించిన కల్కి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 1100 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం దీపిక సింగం అగైన్ సినిమాలో నటిస్తోంది. ఇందులో రణ్ వీర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

దీపికా పదుకొణె లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..