AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్

పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో పోటీగా స్టైల్‌ గా నిల్చుని పోజులు ఇస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి టాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ. అలాగనీ ఆమె హీరోయిన్ కాదు. కానీ అంతకు మించిన గుర్తింపే సొంతం చేసుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ అమ్మాయిగా క్రేజ్ సంపాదించుకుంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు సూపర్ హిట్ సినిమాలకు పని చేసింది. ఆ తర్వాత నిర్మాతగానూ మారి తన అభిరుచిని చాటుకుంది

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Aug 29, 2024 | 5:03 PM

Share

పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో పోటీగా స్టైల్‌ గా నిల్చుని పోజులు ఇస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి టాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ. అలాగనీ ఆమె హీరోయిన్ కాదు. కానీ అంతకు మించిన గుర్తింపే సొంతం చేసుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ అమ్మాయిగా క్రేజ్ సంపాదించుకుంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు సూపర్ హిట్ సినిమాలకు పని చేసింది. ఆ తర్వాత నిర్మాతగానూ మారి తన అభిరుచిని చాటుకుంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న ఆమె మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తనయ సుస్మిత కొణిదెల. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే సుమారు డజను మంది హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఆన్ స్క్రీన్‌పైనే కాకుండా కొందరు ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నవారు కూడా ఉన్నారు.అందులో ఒకరు సుస్మిత. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అడుగుపెట్టింది మెగా డాటర్. తండ్రి, సోదరుడు రామ్ చరణ్ సినిమాలకు పని చేసింది. ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహా రెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య చిత్రాలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్ పని చేయడం విశేషం.

ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది సుస్మిత. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్ పై భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించడం ప్రారంభించింది. మొదట ఓటీటీ వేదికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. షూట్ అవుట్ ఎట్ అలేర్ అనే సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు భారీగానే వ్యూస్ వచ్చా యి. ఆ తర్వాత నరేష్ అగస్త్య, రాజేంద్ర ప్రసాద్, హర్షవర్థన్ ముఖ్య పాత్రల్లో వచ్చిన సేనాపతి మూవీని తెరకెక్కించింది. ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక గతేడాది శ్రీదేవి, శోభన్ బాబు పేరుతో మొదటి సారి ఒక థియేటర్ సినిమాను నిర్మంచింది. ఇందులో సంతోష్ శోభన్, గౌరీ కిషన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇది యావరేజ్ గా నిలిచింది. అయితే ఇటీవల పరువు పేరుతో మరో వెబ్ సిరీస్ ను నిర్మించింది సుస్మిత. జీ5 లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉంది మెగా డాటర్.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యులతో సుస్మిత కొణిదెల..

View this post on Instagram

A post shared by Sushmita (@sushmitakonidela)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?