AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ ఏడో కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క.. ఈమె స్పెషాలిటీ ఏంటో తెలుసా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున తనదైన శైలిలో షోను రన్ చేస్తున్నారు. ఇక మధ్యలో నాని, ప్రియాంక అరుల్ మోహన్, దగ్గుబాటి రానా తదితరులు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. ఇక కంటెస్టెంట్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ ఏడో కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క.. ఈమె స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Bezawada Bebakka
Basha Shek
|

Updated on: Sep 01, 2024 | 9:35 PM

Share

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున తనదైన శైలిలో షోను రన్ చేస్తున్నారు. ఇక మధ్యలో నాని, ప్రియాంక అరుల్ మోహన్, దగ్గుబాటి రానా తదితరులు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. ఇక కంటెస్టెంట్స్ ఒక్కొక్కరూ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రముఖ నటి యష్మి గౌడ, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ నవీన్, నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ, ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఓం, ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏడో కంటెస్టెంట్ గా స్టాండప్ కమెడియన్, సింగర్ బెజవాడ బేబక్క వచ్చింది. స్టేజీపైకి రాగానే నాగ్‌కు హార్ట్‌ సింబల్‌ ఇస్తూ దానిపై మీరే నా బంగార్రాజు అని రాసి తెగ సిగ్గుపడిపోయిందామె. ఇక నాగార్జున కళ్లలో చూస్తే ఎక్కడ కొట్టుకుపోతానోనన్న భయంతో డైరెక్ట్‌గా చూడలేకపోతున్నానంటూ తల వంచుకునే మాట్లాడింది.

ఇక బెజవాడ బేబక్క అసలు పేరు మధూ. సింగర్ గా, స్టాండప్ కమెడియన్ గా ఆమె బాగా పాపులర్. సోషల్ మీడియాలోనూ బేబక్కకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసే కామెడీ రీల్స్ కు నెటిజన్లు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఇవి నెట్టింట బాగా వైరలవుతుంటాయి కూడా. పేరులో బెజవాడ ఉన్నప్పటికీ బేబక్క ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది.అక్కడి పరిస్థితులను కామెడీగా రీల్స్ రూపంలో చేసి ట్రెండ్ అవుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కామెడీ రీల్స్ తో బాగా ఫేమస్..

ఈ రీల్స్ తోనే నెట్టంట ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది బేబక్క. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ ఆఫర్ ను అందుకుంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో నవ్వించిన బెజవాడ బేబక్క అలియాస్ మధూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏ మేర నవ్విస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే