Pushpa 2 OTT: పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. ఏకంగా అన్ని వందల కోట్లా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నారు. సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ పుష్పకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15నే విడుదల కావాల్సిన పుష్ప 2 కొన్ని కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది.

Pushpa 2 OTT: పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. ఏకంగా అన్ని వందల కోట్లా?
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2024 | 9:22 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నారు. సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ పుష్పకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15నే విడుదల కావాల్సిన పుష్ప 2 కొన్ని కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. దీనికి సంబంధించి ఈ మధ్యనే చిత్ర నిర్మాత రవిశంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబరు-అక్టోబరు కల్లా మరో రెండు సాంగ్స్ రిలీజ్ అవుతాయని,ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేత చెప్పుకొచ్చారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు 6న థియేటర్లలో పుష్ప 2 రిలీజ్ పక్కాగా ఉంటుందని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదిలా ఉండగానే పుష్ప 2 సినిమా ఓటీటీ హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఒకటి తెగ వైరల్ అవుతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ మూవీకి లేనంతగా ఏకంగా రూ.270 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

కాగా పుష్ప 2 లో రష్మిక మందన్నా పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ వర్సెస్ పుష్పరాజ్ మధ్య నడిచే యాక్షన్ డ్రామా మరో లెవెల్ లో ఉంటుందని టాక్. ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. కాగా మొదటి పార్ట్ కంటే మించి ఉండేలా సుమారు రూ. 500 కోట్లతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ . త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. మరోవైపు ‘పుష్ప’ పార్ట్ 3 కూడా ఉండొచ్చని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో రావు రమేశ్ చెప్పుకొచ్చారు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.