Jr NTR: రిషబ్ శెట్టి సంస్కారానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఎన్టీఆర్ తల్లి కనిపించగానే ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్

సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉంటోన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ శనివారం (ఆగస్టు 31) కర్ణాటకలో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉడిపిలోని ప్రఖ్యాత శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. ఎన్టీఆర్ వెంట ఆమె తల్లి, సతీమణి కూడా ఉన్నారు. కన్నడ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి మంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన తారక్ ఫ్యామిలీని దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు

Jr NTR: రిషబ్ శెట్టి సంస్కారానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఎన్టీఆర్ తల్లి కనిపించగానే ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్
Jr NTR, Rishab Shetty
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2024 | 8:40 PM

సినిమా షూటింగులో బిజీ బిజీగా ఉంటోన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ శనివారం (ఆగస్టు 31) కర్ణాటకలో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉడిపిలోని ప్రఖ్యాత శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. ఎన్టీఆర్ వెంట ఆమె తల్లి, సతీమణి కూడా ఉన్నారు. కన్నడ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత రిషబ్ శెట్టి మంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగిన తారక్ ఫ్యామిలీని దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు. ముందుగా ఎన్టీఆర్ ను హగ్ చేసుకున్నాడు రిషబ్. ఆ తర్వాత ఎన్టీఆర్ తల్లి దగ్గరకు వెళ్లి ఆమె కాళ్లకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత అందరూ ఉడుపి శ్రీ కృష్ణ మఠం ఆలయానికి బయల్దేరారు.ఎన్టీఆర్ ఫ్యామిలీ వెంట రిషబ్ తో పాటు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అక్కడికి వచ్చారు. ఇక ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆలయ సందర్శనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నాడు రిషబ్. అందరూ కలిసి సరదాగా అరిటాకుల్లో భోజనం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

కాగా ఎన్టీఆర్ తల్లి కుందాపూర్ సందర్శించాలని, ఉడిపి కృష్ణుని దర్శనం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటుంద. అందులో భాగంగానే ఇప్పుడు షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ తీసుకుని తన తల్లిని కుందాపూర్ తీసుకెళ్లాడు తారక్. అలాగే ఉడిపి శ్రీకృష్ణుడిని కూడా దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పట్ల రిషబ్ శెట్టి చూపించిన ఆదరాభిమానాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆయన సంస్కారానికి సెల్యూట్ చేయాల్సిందే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇదిగో..

కాగా ఎన్టీఆర్ తల్లిది, రిషబ్ శెట్టిది ఒకే ఊరు. అదే కుందపుర. ఈనేపథ్యంలో ఎన్టీఆర్-రిషబ్ కలసి కనిపించారు. ఉడుపి ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.

ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Jr NTR (@jrntr) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

రిషబ్, ప్రశాంత్ నీల్ లతో ఎన్టీఆర్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Jr NTR (@jrntr) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన