Bigg Boss Telugu 8: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్.. మొదటి కంటెస్టెంట్ ఎవరంటే?

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 1) సాయంత్రం లాంఛింగ్ ఈవెంట్ లో మొదట హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అందరికీ వెల్కమ్ చెప్పిన ఆయన నేరుగా బిగ్ బాస్ హౌసులోకి వెళ్లిపోయారు. అక్కడ ఏమేం ఉన్నాయో అందరికీ చూపించేశారు. ఈసారి స్పెషల్ రూమ్ అలియాస్ ఇన్ఫినిటీ రూమ్ ఉందని...

Bigg Boss Telugu 8: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్.. మొదటి కంటెస్టెంట్ ఎవరంటే?
Bigg Boss Telugu 8
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2024 | 7:31 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 1) సాయంత్రం లాంఛింగ్ ఈవెంట్ లో మొదట హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అందరికీ వెల్కమ్ చెప్పిన ఆయన నేరుగా బిగ్ బాస్ హౌసులోకి వెళ్లిపోయారు. అక్కడ ఏమేం ఉన్నాయో అందరికీ చూపించేశారు. ఈసారి స్పెషల్ రూమ్ అలియాస్ ఇన్ఫినిటీ రూమ్ ఉందని.. అలానే గోల్డెన్ రూమ్ (స్ట్రేటజీస్ ప్లే చేసే రూమ్), తూనీగ రూమ్ (కష్టంతో పాటు అదృష్టం ఉంటే గానీ ఇందులోకి రాలేరు), నెమలి (ఆడే బలం, ఆలోచించే పవర్ ఉండాలి), జీబ్రా రూమ్ (ఎవరికీ లొంగకుండా, మాట పొగరుకు భయపడకుండా ఉండేవాళ్లే ఈ రూమ్ లోకి వస్తారు) అని చెప్పుకొచ్చారు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ కంటెస్టెంట్ గా ప్రముఖ బుల్లితెర నటి యష్మీ గౌడ వచ్చేసింది. ‘నాటీ నాటీ గాళ్’ పాటకు స్టెప్పులు వేస్తూ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చేసిందీ అందాల తార. ఆ తర్వాత మ్యాడ్ సినిమాలోని పాటలకు మళ్లీ కాలు కదిపింది.

‘స్వాతి చినుకులు’, ‘నాగభైరవి’, ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్స్ తో బుల్లితెర అభిమానుల్లో మంచి గుర్తింపు సాధించుకుంది యష్మీ గౌడ. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక బిగ్ బాస్ వేదిక మీదకు రాగానే నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పి రెడ్ రోజెస్ ఇచ్చింది యష్మీ గౌడ. ఆ తర్వాత ఆ పూలను తనకు ఇవ్వాల్సిందిగా కోరితే.. నాగార్జున అలాగే చేశాడు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ వేదికపై యష్మీ గౌడ…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.