Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అంజలి పవన్.. ఆఖరి నిమిషంలో నో చెప్పిన వైనం.. కారణమిదే

ఇక ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. ఇదే సమయంలో చాలామంది సెలబ్రిటీలు చివరి నిమిషంలో బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో బుల్లితెర ప్రముఖ నటి అంజలి పవన్ కూడా ఉంది. పలు టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర అభిమానులు మనసులు గెల్చుకుందీ అందాల తార.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అంజలి పవన్.. ఆఖరి నిమిషంలో నో చెప్పిన వైనం.. కారణమిదే
Bigg Boss 8 Telugu
Follow us

|

Updated on: Sep 01, 2024 | 6:49 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ‘లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్’ అంటూ వరుసగా రిలీజవుతోన్న ప్రోమోలు ఎనిమిదో సీజన్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. ఇదే సమయంలో చాలామంది సెలబ్రిటీలు చివరి నిమిషంలో బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో బుల్లితెర ప్రముఖ నటి అంజలి పవన్ కూడా ఉంది. పలు టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర అభిమానులు మనసులు గెల్చుకుందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కూతురు చందమామ అలియాస్ ధన్వికతో కలిసి ఆమె చేసే ఫోటోషూట్స్ కు నెట్టింట భారీగా క్రేజ్ ఉంది. ఈ కారణంగానే అంజలి పవన్ కూతురు కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అంజలి పవన్ కూడా రానుందని తెగ ప్రచారం జరిగింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయట. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వెళ్లడం లేదని సడెన్ ట్విస్ట్ ఇచ్చిందీ బుల్లితెర బ్యూటీ.ఆఖరి నిమిషంలో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వమని బిగ్ బాస్ యాజమాన్యం కోరడంతో దానికి అంజలి తిరస్కరించినట్లు సమాచారం. అయితే తన అనూహ్య నిర్ణయానికి కారణాలను వివరిస్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను కూడా అప్ లోడ్ చేసింది అంజలి పవన్. అందులో ఇలా చెప్పుకొచ్చింది.

‘నా భర్త పవన్‌కు, కూతురు ధన్వికకు ఆరోగ్యం అసలు బాగోలేదు. రెండు మూడు నెలలుగా మేం ఏదో ఒక అనారోగ్య సమస్యలతోనే సతమతమవుతున్నాం. అందుకనే వీడియోలు కూడా పెట్టడం లేదు. పరీక్షలు చేయిస్తే ధన్వికి చికెన్‌ గున్యా అని, పవన్‌కు టైఫాయిడ్‌ అని తేలింది. వర్షాకాలం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. బిగ్‌బాస్‌ విషయానికి వస్తే గతంలో లాగే ఈ సీజన్‌ నుంచి కూడా నాకు పిలుపు వచ్చింది. వెళ్దామని కూడా అనుకున్నాను. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాను. కానీ ఇంట్లో వాళ్ల ఆరోగ్యం బాగోలేకపోవడంతో బిగ్ బాస్ షోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నాను. ఇప్పటికీ నా కుటుంబమే నాకు ముఖ్యం కాబట్టి ఇప్పుడైతే బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు’ అని చెప్పుకొచ్చింది అంజలి పవన్.

ఇవి కూడా చదవండి

అంజలి పవన్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

మరి బిగ్ బాస్ కోరినట్లు నాలుగైదు వారాల తర్వాత అంజలి పవన్ వైల్డ్ కార్ట్ ఎంట్రీగా హౌస్ లోకి అడుగుపెడుతుందేమో చూడాలి.

భర్త, కూతురితో అంజలి పవన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.