- Telugu News Photo Gallery Cinema photos Interesting facts about Bigg Boss 8 Telugu Contestant Sonia Akula
Bigg Boss 8 Telugu: కరీంనగర్ రైతు బిడ్డ.. కరాటే ఫైటర్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా బ్యాగ్రౌండ్ మామలుగా లేదుగా
బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో ఏడుగురు అమ్మాయిలుకాగా మరో ఏడుగురు అబ్బాయిలు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈసారి సీజన్ లో ఒకరిద్దరు తప్పితే పెద్దగా తెలిసిన ముఖాలు లేవు. కాగా ఈసారి కూడా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ క్యాంప్ నుంచి సోనియా ఆకుల బిగ్ బాస్ హౌసులోకి అడుగుపెట్టింది.
Updated on: Sep 02, 2024 | 9:52 PM

Sonia Akula

గతంలో రామ్ గోపాల్ వర్మ డెన్ నుంచి అషూరెడ్డి, అరియానా గ్లోరీ, ఇనయా సుల్తానా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణకు చెందిన సోనియా ఆకుల కూడా చేరిపోయింది. మంథని ప్రాంతానికి చెందిన సోనియా మంచి , సోషల్ వర్కర్ కూడా.

బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగు పెట్టిన సోనియా ఆకుల తాను కరాటే ఫైటర్ అని చెప్పి హోస్ట్ నాగార్జుతో పాటు అందరినీ షాకయ్యేలా చేసింది

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'కరోనా వైరస్', 'ఆశ ఎన్ కౌంటర్' సినిమాల్లో కీలక పాత్రలు చేసింది సోనియా. అంతకుముందు 'జార్జ్ రెడ్డి' మూవీలో హీరో చెల్లి పాత్రలో నటించింది.

సోషల్ మీడియాలోనూ సోనియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నెట్టింట షేర్ చేసే ఫొటోలకు నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తూ ఉంటుంది.




