- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi challenged the directors to plan a multi starrer in Balayya and Chiru combo
Chiru Balayya Combo: దర్శకులకు చిరు సవాల్.. బాలయ్యతో మల్టీస్టారర్ అంటూ.. కెప్టెన్స్ సిద్ధమయ్యేనా.?
మాట్లాడితే మా కథలు స్టార్ హీరోలకు నచ్చట్లేదు.. వాళ్లకు అన్నీ కమర్షియల్ కథలే కావాలి.. ప్రయోగాత్మక కథలు రాస్తే ఒప్పుకోరు అంటుంటారు కొందరు రైటర్స్. అలాంటి వాళ్లకు ఇప్పుడు అదిరిపోయే సవాల్ విసిరారు చిరు. ఆయన చేసిన ఛాలెంజ్‌తో దర్శకులకు దిమ్మ తిరిగిపోతుంది. ఇంతకీ చిరంజీవి ఏం సవాల్ విసిరారు..? దానికి దర్శకుల రియాక్షన్ ఏంటి..?
Updated on: Sep 03, 2024 | 12:57 PM

గణనాధునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పాల ఉండ్రాళ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు బియ్యపు పిండి : కప్పున్నర, పాలు : 2 1/2 కప్పులు, చక్కెర : 100 గ్రా, యాలకుల పొడి : చిటికెడు, సాబుదానా(సగ్గుబియ్యం) : 3 టేబుల్ స్పూన్స్, నూనె : పావు టీస్పూన్ ఒక గిన్నెలో తగినన్ని(ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు)నీళ్లు, నూనె పోసి మరిగించాలి. అందులో బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలిపి కొద్దిగా చేతులకు నూనె రాసుకొని పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టిన ఉండలను ఆవిరి మీద వీటిని ఉడికించిన తర్వాత ఈ లోపు గిన్నెలో పాలు పోసి మరిగించాలి. తర్వాత పాలల్లో సాబుదానా ఓ పావుగంట నానబెట్టుకోని చక్కెర, యాలకుల పొడి వేసి సన్నని మంటమీద పది నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా బియ్యం పిండి వేసి చిక్కగా అయ్యేలా చూడాలి. ఆ తర్వాత ఉడికించిన ఉండ్రాళ్లను వేసి సన్నని మంట మీద నాలుగు నిమిషాలు ఉంచి దించేయాలి.

చిరంజీవి ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. బాలయ్య ఈవెంట్‌కు వచ్చిన మెగాస్టార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తనకు బాలయ్యతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.

లైన్ కూడా చిరంజీవే ఇచ్చారు. ఇండస్ట్రీలో ఎవరైనా దర్శకులు, రచయితలు ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి కారెక్టర్స్‌ను తీసుకుని కథ రాస్తే బాగుంటుందని ఈ వేడుకలో అన్నారు మెగాస్టార్.

ఇంద్ర, సమరసింహారెడ్డి కారెక్టర్స్‌తో సీక్వెల్ చేస్తే నటించాలని ఉందని.. నీకు ఓకేనా బాలయ్య అంటూ పక్కనే ఉన్న NBKను కూడా అడిగారు చిరు. దానికి బాలయ్య కూడా సై అన్నారు.

బోయపాటితో పాటు అక్కడున్న చాలా మంది దర్శకులను పేరు పెట్టి మరీ సవాల్ విసిరారు చిరంజీవి. అన్నీ కుదిరి.. ఈ కాంబో సెట్ అయితే మాత్రం హైప్‌తోనే థియేటర్స్ తగలబడిపోతాయేమో..?




