రామ్ చరణ్, శంకర్ టీంను కంగారు పెడుతున్న ఆ సినిమా మరేంటో కాదు.. ముఫాసా ది లయన్ కింగ్. ఐదేళ్ళ కింద వచ్చిన లయన్ కింగ్ ఇండియాలోనే 200 కోట్లు వసూలు చేసింది. దీని ప్రీక్వెల్‌కు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారిప్పుడు. దాంతో ప్రాపర్ తెలుగు సినిమాలా డిసెంబర్ 20న రానుంది ముఫాసా. మొత్తానికి అటు దేవర.. ఇటు గేమ్ ఛేంజర్‌కు హాలీవుడ్ టెన్షన్ తప్పట్లేదు.