AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కోహ్లీ అలా చేయకుంటే నేను సిగ్గుపడతాను..’: హర్భజన్ సింగ్ షాకింగ్ స్టేట్‌మెంట్..

Harbhajan Singh vs Virat Kohli: హర్భజన్ సింగ్ భారతదేశపు దిగ్గజ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు అన్నింటిలోనూ అతని మ్యాజిక్ కనిపిస్తుంది. హర్భజన్ జట్టులో ఉండగానే విరాట్ కోహ్లీ అరంగేట్రం చేశాడు. కోహ్లి, భజ్జీ చాలా కాలం పాటు టీమిండియా తరపున కలిసి ఆడారు.

'కోహ్లీ అలా చేయకుంటే నేను సిగ్గుపడతాను..': హర్భజన్ సింగ్ షాకింగ్ స్టేట్‌మెంట్..
Harbhajan Singh Vs Virat Ko
Venkata Chari
|

Updated on: Sep 03, 2024 | 1:42 PM

Share

Harbhajan Singh vs Virat Kohli: హర్భజన్ సింగ్ భారతదేశపు దిగ్గజ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు అన్నింటిలోనూ అతని మ్యాజిక్ కనిపిస్తుంది. హర్భజన్ జట్టులో ఉండగానే విరాట్ కోహ్లీ అరంగేట్రం చేశాడు. కోహ్లి, భజ్జీ చాలా కాలం పాటు టీమిండియా తరపున కలిసి ఆడారు. వీరిద్దరూ 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉన్నారు. భారత క్రికెట్‌లోని గొప్ప ఆటగాళ్లలో కోహ్లి ఎలా ఒకడిగా నిలిచాడో హర్భజన్ చెప్పుకొచ్చాడు.

హర్భజన్ 2008లో విరాట్ మొదటి సిరీస్, 2011లో అతని ప్రారంభ టెస్ట్ స్టోరీలను వివరించాడు. మెరుగైన ప్రదర్శన చేయాలనే విరాట్ నిరంతరమైన కోరిక, అతనిని క్రికెట్ లెజెండ్‌గా మార్చిన పరివర్తన గురించి మాట్లాడాడు. 2008లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే సిరీస్‌లో కోహ్లి ఒక మరపురాని సంఘటనను హర్భజన్ గుర్తు చేసుకున్నాడు.

కోహ్లీ అసంతృప్తి..

ఇన్నింగ్స్ ప్రారంభించే సమయంలో కోహ్లి అర్ధశతకం సాధించాడు. కానీ, అతను తన ఇన్నింగ్స్‌తో సంతోషంగా లేడు. తరువర్ పోడ్‌కాస్ట్‌లో హర్భజన్ మాట్లాడుతూ, “నాకు ఒక సంఘటన గుర్తుంది. వీరూ (వీరేంద్ర సెహ్వాగ్) గాయపడ్డాడని అనుకుంటా. అజంతా మెండిస్ అందరినీ అవుట్ చేశాడు. అతను (విరాట్) బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. అతను నన్ను, ‘పాజీ, నేను ఎలా ఆడాను?’ అని అడిగాడు. చాలా బాగుంది అని అన్నాను. అప్పుడు అతను, ‘పాజీ, నేను బయటికి రాకూడదు అంటూ నిర్ణయించుకున్నాడు. విరాట్ వైఖరి నాకు బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్‌లో విరాట్‌కు ఇబ్బందులు..

2011లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు సిరీస్‌లో కోహ్లీ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా హర్భజన్ మాట్లాడాడు. భజ్జీ మాట్లాడుతూ, “నేను అతని టెస్ట్ క్రికెట్ గురించి మీకు చెప్పాలంటే, మొదట వెస్టిండీస్‌లో ఉన్నాం. ఆ పర్యటనలో, ఫిడెల్ ఎడ్వర్డ్స్ (మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్) అతన్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అతను ఎల్‌బీడబ్ల్యూ లేదా షార్ట్ బాల్‌లో ఔట్ అయ్యాడు. మళ్లీ మళ్లీ ఇలా పెవిలియన్‌కు వస్తున్నాడు. కాబట్టి అతను చాలా నిరాశకు గురయ్యాడు. తనలో తానే ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమయంలో నేను అతనితో, ‘నువ్వు 10,000 పరుగులు చేయలేకపోతే, సిగ్గుపడతాను. టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు చేసే అవకాశం ఉంది. స్కోర్ చేయకపోతే అది నీ స్వంత తప్పు అవుతుంది’ అని చెప్పాను. ఆ తర్వాత కోహ్లి ఏం చేశాడో అందరికీ తెలిసిందే.

కోహ్లీలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి..

హర్భజన్ చెప్పిన ఈ మాటలు ఆ తర్వాత సరైనవని తేలింది. ఆ తర్వాత 13 ఏళ్లలో క్రికెట్ దిగ్గజాలలో కోహ్లీ ఒకడిగా నిలిచాడు. ఈ సమయంలో కోహ్లీ తన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. హర్భజన్ ఇంకా మాట్లాడుతూ, “నేను అతనిని మారడం చూశాను. నాలో నేను చూసినదానికంటే ఎక్కువ దృఢ సంకల్పం కోహ్లీకి ఉంది. అతను ఆస్ట్రేలియాలో నిరంతరం సెంచరీలు సాధించాడు. భారత్ 400 పరుగుల లక్ష్యాన్ని చేధించడం అదే తొలిసారి. మనం ఓడిపోవచ్చు కానీ పోరాడాం. ముందుకు సాగే ఈ వైఖరి ఓ ఆటగాడిగా చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లి 113 టెస్టుల్లో 8,848 పరుగులు సాధించాడు. విరాట్ 10,000 టెస్ట్ పరుగుల మైలురాయిని అధిగమిస్తాడని అంచనా వేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి