Blue Aadhaar Card: బ్లూ ఆధార్‌ కార్డును ఎవరికి జారీ చేస్తారు? దరఖాస్తు చేయడం ఎలా?

ఈ రోజుల్లో ఆధార్‌ కార్డు అనే ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. సిమ్‌ కార్డు నుంచి వివిధ రకాల పథకాల వరకు ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్‌ ఉండాల్సిందే. సాధారణంగా ఆధార్‌ కార్డులు తెలుపురంగులో..

Blue Aadhaar Card: బ్లూ ఆధార్‌ కార్డును ఎవరికి జారీ చేస్తారు? దరఖాస్తు చేయడం ఎలా?
Blue Aadhaar Card
Follow us
Subhash Goud

|

Updated on: Aug 09, 2024 | 4:58 PM

ఈ రోజుల్లో ఆధార్‌ కార్డు అనే ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. సిమ్‌ కార్డు నుంచి వివిధ రకాల పథకాల వరకు ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్‌ ఉండాల్సిందే. సాధారణంగా ఆధార్‌ కార్డులు తెలుపురంగులో ఉంటాయని విషయం అందరికి తెలిసిందే. మరి బ్లూ ఆధార్‌ కార్డు గురించి మీరెప్పుడైనా విన్నారా? దీన్నే బాల ఆధార్‌ అని పిలుస్తుంటారు. ఈ బ్లూ ఆధార్‌ కార్డు అంటే నీలం రంగులో ఉండే ఈ కార్డును ప్రత్యేకంగా పిల్లల కోసం జారీ చేస్తారు. దీనిని యూఐడీఏఐ నుంచి జారీ అవుతుంది. ఈ బ్లూ ఆధార్‌ను ఎలా జారీ చేస్తారో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Bank Nominees Rules: బ్యాంకింగ్‌ చట్టాల్లో మార్పు.. నామినీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

ఐదేళ్లలోపు ఉన్న పిల్లల కోసం ఈ బ్లూ ఆధార్‌ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డు జారీ చేయాలంటే పిల్లల బయోమెట్రిక్‌ లాంటివేవి అవసరం లేదు. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతో ఆధార్‌ను జారీ జారీ చేస్తారు. వీరి కార్డును తల్లిదండ్రుల ఆధార్‌ సంఖ్యతో అనుసంధించి ఉంటుంది. బాల ఆధార్‌ కార్డు కాలపరిమితి ఎంతో తెలుసా? పిల్లలు ఐదేళ్లు వచ్చేవరకు మాత్రమే. ఆ తర్వాత వేలిముద్రలు, ఐరిష్‌ వంటి వివరాలను నమోదు చేసి ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేస్తారు. అంతేకాదు 15 ఏళ్ల తర్వాత మరోసారి వివరాలతో ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్లూ ఆధార్‌ను ఎలా నమోదు చేయాలి?

  1. పిల్లల కోసం ప్రత్యేకంగా జారీ చేసి ఈ బ్లూ ఆధార్‌ కోసం ఆధార్‌ నమోదు కేంద్రానికి తల్లిదండ్రులు ఆధార్‌ కార్డు (Aadhaar card), చిరునామా, పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, ఒక ఫొటో తీసుకొని వెళ్లాలి.
  2. ఆధార్‌ నమోదు ఫారంలో వివరాలు నమోదు చేయాలి. అందులో తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలను కూడా అందజేయాలి. ఈ ఫారాన్ని ఉడాయ్‌ వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నమోదు చేయవచ్చు.
  3. తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్‌నే పిల్లల ఆధార్‌ కార్డుకూ అనుసంధానిస్తారు. అందుకే నంబర్‌ కూడా ఫారంలోనే నింపాల్సి ఉంటుంది.
  4. తర్వాత మీరు అందించిన పత్రాలను ధ్రువీకరిస్తారు. ఆ తర్వాత ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.
  5. ఈ ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌ని తప్పకుండా తీసుకోవాలి. అందులో ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఉంటుంది. ఇది ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసే సమయంలో ఉపయోగపడుతుంది.
  6. ఈ బ్లూ ఆధార్‌ 60 రోజుల్లోగా మీ పిల్లల పేరుపై కార్డును జారీ చేస్తారు. బ్లూ ఆధార్‌ తీసుకోవాలంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌.. రీఛార్జ్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా? టెన్షన్‌ పెడుతున్న ట్రాయ్‌ రూల్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి