Liquor Prices: మద్యం ప్రియులకు షాకింగ్‌న్యూస్‌.. పెరగనున్న బీర్ల ధరలు!

సాయంత్రం అయ్యిందంటే చాలు బార్లలో మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. రోజురోజుకు లిక్కర్‌ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి. అయితే ధర ఎంత ఉన్నా అమ్మకాలు మాత్రం ఆగవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే బీర్ల తయారీ కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను..

Liquor Prices: మద్యం ప్రియులకు షాకింగ్‌న్యూస్‌.. పెరగనున్న బీర్ల ధరలు!
Liquor Shop
Follow us

|

Updated on: Aug 07, 2024 | 8:45 AM

సాయంత్రం అయ్యిందంటే చాలు బార్లలో మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. రోజురోజుకు లిక్కర్‌ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి. అయితే ధర ఎంత ఉన్నా అమ్మకాలు మాత్రం ఆగవు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే బీర్ల తయారీ కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ భారం వినియోగదారులపైనే పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారు అవుతోంది. ఆ బీరును తెలంగాణ రాష్ట్రంబేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎ్‌సబీసీఎల్‌) కొనుగోలుచేసి.. మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 12 బీర్ల కేసుకుగాను బ్రూవరీలకు టీఎస్‌బీసీఎల్‌ రూ.289 చెల్లిస్తోంది. పన్నులన్నీ కలుపుకొని కేసుకు రూ.1400 చొప్పున రిటైలర్లకు (మద్యం దుకాణాలు) విక్రయిస్తుండగా.. ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం దుకాణాలవారు కేసు రూ.1800 చొప్పున విక్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌.. రీఛార్జ్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా? టెన్షన్‌ పెడుతున్న ట్రాయ్‌ రూల్స్‌

అంటే.. ఒక్కో బీరునూ ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొనుగోలు చేసి రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయిస్తుండగా.. వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో బీరు ధరా రూ.150 అవుతోంది. రాష్ట్రంలో బీర్ల డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు బీర్లను ఉత్పత్తి చేస్తాయి.

ఇవి కూడా చదవండి

రెండేళ్ల పాటు ఒప్పందం:

అయితే బ్రూవరీలతో సర్కార్‌ కుదుర్చుకునే ఒప్పందం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్లీ రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు. ప్రతి రెండేళ్లకూ బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపు 10 శాతం మేర పెంచుతూ ఉంటుంది.

చివరిసారిగా రెండేళ్ల క్రితం 2022 మే నెలలో 6శాతంచొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈసారి 20-25 శాతం పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేర పెంచినట్లయితే ధరలను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రభావం మందుబాబుపై పడే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం 10-12శాతం వరకూ పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ఒక వేళ ధరలు పెంచాలని నిర్ణయిస్తే కేవలం బీర్లపైనే ఉండనుంది. మిగతా వాటి ధరలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Whatsapp: ఈ ఫోన్లు మీ వద్ద ఉన్నాయా? 35 ఫోన్‌లలో వాట్సాప్‌ బంద్‌.. లిస్ట్‌ చెక్‌ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..