Aadhaar Update: ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాను ఎలా అప్‌డేట్ చేయాలి?

భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డ్ అనేది వ్యక్తిగత గుర్తింపు కార్డు మాత్రమే కాదు, కీలకమైన చిరునామా సర్టిఫికేట్ కూడా. పాఠశాలలు, కళాశాలలు, వైద్యవిద్య, ప్రయాణాలు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు వంటి ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుండా చాలా పనులు చేయడం అసాధ్యం. ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం కాబట్టి..

Aadhaar Update: ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాను ఎలా అప్‌డేట్ చేయాలి?
Aadhaar
Follow us
Subhash Goud

|

Updated on: Aug 06, 2024 | 11:54 AM

భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డ్ అనేది వ్యక్తిగత గుర్తింపు కార్డు మాత్రమే కాదు, కీలకమైన చిరునామా సర్టిఫికేట్ కూడా. పాఠశాలలు, కళాశాలలు, వైద్యవిద్య, ప్రయాణాలు, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు వంటి ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేకుండా చాలా పనులు చేయడం అసాధ్యం. ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం కాబట్టి, ఆధార్‌లోని వివరాలు సరైనవి కావడం ముఖ్యం. మీ ఆధార్‌లో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే, వెంటనే దాన్ని సరిదిద్దడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేకుంటే జైలుకే..

ఆధార్‌లో చిరునామా అప్‌డేట్‌ తప్పనిసరి

ప్రధానంగా ఒక వ్యక్తి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారినట్లయితే, అతను దానిని ఆధార్ కార్డులో అప్‌డేట్ చేయాలి. మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతున్నట్లయితే, మీరు తప్పనిసరిగా చిరునామాను అప్‌డేట్ చేయాలి. అంటే ఇంటి అడ్రస్‌ను మార్చాల్సి ఉంటుంది. మీరు దీన్ని ఇంటి నుండి చేయవచ్చు. కొత్తగా మారిన ఇంటి కరెంటు బిల్లు ఒక్కటే చాలు.

ఆన్‌లైన్‌లో ఆధార్ చిరునామాను ఎలా అప్‌డేట్ చేయాలి?

  1. ముందుగా మీరు UIDAI యొక్క My Aadhaar వెబ్‌సైట్‌కి వెళ్లాలి . ఆ తర్వాత ఆధార్ నంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసి, సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి.
  2. ఆపై మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి, లాగిన్‌పై క్లిక్ చేయండి.
  3. ఆ తర్వాత వెబ్‌లో కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. దాని కింద అడ్రస్ అప్‌డేట్‌పై క్లిక్ చేసి, ఆపై అప్‌డేట్ ఆధార్‌పై క్లిక్ చేయండి.
  4. అప్పుడు కొత్త పేజీ కనిపిస్తుంది. అందులోని సమాచారాన్ని వెరిఫై చేసి, ఆపై ఆధార్ అప్‌డేట్ ప్రాసెస్‌పై క్లిక్ చేయండి.
  5. దీని తర్వాత ప్రస్తుత చిరునామా తెరపై కనిపిస్తుంది. ఆ తర్వాత దాని కింద కనిపించే Details to be updated అనే విభాగంలో మీరు మార్చాలనుకుంటున్న వివరాలను నమోదు చేసుకోవాలి.
  6. పూర్తి చిరునామాను అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు చిరునామా రుజువుగా విద్యుత్ బిల్లును అప్‌డేట్ చేయాలి.
  7. దీనికి రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.
  8. పై విధానాలను అనుసరించడం ద్వారా మీరు ఇంటి వద్ద ఆధార్‌లోని చిరునామాను అప్‌డేట్‌ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: వామ్మో.. ముఖేష్ అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..