AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లే ధనవంతులు అవుతారు..! రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత షాకింగ్‌ కామెంట్స్‌

అమెరికా ఫిన్‌టెక్ దిగ్గజం Block Inc., 4,000 మంది ఉద్యోగులను AI కారణంగా తొలగించింది. ఆర్థిక సమస్యలు కాదని, కృత్రిమ మేధస్సుతో సామర్థ్యం పెరగడమే దీనికి కారణమని CEO జాక్ డోర్సే వెల్లడించారు. రాబర్ట్ కియోసాకి దీనిపై స్పందిస్తూ, AI ధనవంతులను మరింత ధనవంతులను చేస్తుందని, ఉద్యోగ భవిష్యత్తు కోసం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

వాళ్లే ధనవంతులు అవుతారు..! రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత షాకింగ్‌ కామెంట్స్‌
Robert Kiyosaki
SN Pasha
|

Updated on: Feb 28, 2026 | 8:28 PM

Share

అమెరికా ఫిన్‌టెక్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన Block Inc. (స్క్వేర్, క్యాష్ యాప్‌ల మాతృసంస్థ) ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం, అంటే 4,000 మందికి పైగా ఉద్యోగులను తగ్గించనున్నట్లు సంస్థ సీఈఓ జాక్ డోర్సే ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయం ఆర్థిక ఇబ్బందుల వల్ల కాకుండా, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం పెరగడమే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.

డార్సీ వివరించిన ప్రకారం.. ఆధునిక ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతో చిన్న టీమ్‌తోనే ఎక్కువ పనిని వేగంగా పూర్తి చేయగలుగుతున్నామని చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి గణనీయమైన ఆదాయం తెచ్చేవారని, అయితే ఇప్పుడు అదే పనిని AI సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని ఆయన అంగీకరించారు. దీంతో సంస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఉద్యోగుల సంఖ్యను సుమారు 6 వేల పరిధిలోకి తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ పరిణామంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రముఖ ఆర్థిక గురువు, రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి ఎక్స్‌ వేదికగా దీనిపై స్పందించారు. AI ధనవంతులను మరింత ధనవంతులను చేస్తోంది అంటూ ఆయన హెచ్చరించారు. ఉద్యోగి దృష్టితో మాత్రమే ఆలోచిస్తే AI భవిష్యత్తులో స్థానాన్ని భర్తీ చేసే ప్రమాదం ఉందని, అదే వ్యాపార దృక్పథంతో AIని ఉపయోగించగలిగితే అది సంపద సృష్టించే శక్తివంతమైన సాధనంగా మారుతుందని కియోసాకీ పేర్కొన్నారు. టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో నైపుణ్యాలను నవీకరించుకోవడం, AIతో కలిసి పనిచేసే సామర్థ్యం పెంచుకోవడం అత్యవసరమని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us