Nataratnalu OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

సాధారణంగా థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలో కూడా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజవుతుంటాయి. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు వారం మధ్యలోనే సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అది కూడా ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటనలు లేకుండా. అలా మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలై యావరేజ్ గా నిలిచిన ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

Nataratnalu OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
Nataratnalu Movie
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 04, 2024 | 8:43 AM

సాధారణంగా థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలో కూడా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజవుతుంటాయి. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు వారం మధ్యలోనే సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అది కూడా ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటనలు లేకుండా. అలా మూడు నెలల క్రితం థియేటర్లలో విడుదలై యావరేజ్ గా నిలిచిన ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అదే బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా ప్రధాన పాత్రలో నటించిన నట రత్నాలు. అలనాటి అందాల తార అర్చన ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది. ఈ ఏడాది మే17న థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ యావరేజ్ గా నిలిచింది. కథ, కథనాలు బాగున్నా సరైన ప్రమోషన్స్ నిర్వహించలేదు. అందుకే మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది. ఇప్పుడీ నటరత్నాలు సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మంగళవారం ( సెప్టెంబర్ 3) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ జరిగిన తర్వాత సుమారు మూడు నెలల తర్వాత నటరత్నాలు సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం. అయితే ఇక్కడే ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు.

నటరత్నాలు మూవీ ప్రస్తుతం కేవలం రెంటల్ బేస్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ సినిమాను చూడాలంటే రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని సమాచారం. నర్ర శివనాగు తెరకెక్కించిన నటరత్నాలు సినిమాలో సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీలో ఏదో సాధించాలని ఆశలతో వెళ్లిన ముగ్గురు యువకులు.. తీరా అక్కడికి వెళ్లాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారన్న దాని చుట్టూ నటరత్నాలు సినిమా తిరుగుతూ ఉంటుంది. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారు టైమ్ పాస్ కోసం ఈ మూవీని చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. లారీలో మంట‌లు.. ఆ పక్కనే ఉన్న..?
తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. లారీలో మంట‌లు.. ఆ పక్కనే ఉన్న..?
హాలీవుడ్​ లో 'దేవర' ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?
హాలీవుడ్​ లో 'దేవర' ఫీవర్.. అమెరికాకు జూనియర్ ఎన్​టీఆర్ పయనం.?
కరోనా తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా..!
కరోనా తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా..!
మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!
మిస్టరీ వీడింది.. భూమిపై 9 రోజులు భయానక శబ్దాలు.!
రేప్ చెయ్యడానికొచ్చిన డాక్టర్‌.. ప్రైవేట్ పార్టులను కోసేసిన నర్స్
రేప్ చెయ్యడానికొచ్చిన డాక్టర్‌.. ప్రైవేట్ పార్టులను కోసేసిన నర్స్
కూలీకి కోటిన్నర వజ్రం దొరికింది.రాత్రికిరాత్రే జీవితం మారిపోయింది
కూలీకి కోటిన్నర వజ్రం దొరికింది.రాత్రికిరాత్రే జీవితం మారిపోయింది
ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ఎంతవరకు వచ్చింది.? వీడియో..
ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ఎంతవరకు వచ్చింది.? వీడియో..
అమెజాన్‌లో తీవ్ర కరవు. కరవులో చిక్కుకున్న డజన్ల కొద్ది తెగలప్రజలు
అమెజాన్‌లో తీవ్ర కరవు. కరవులో చిక్కుకున్న డజన్ల కొద్ది తెగలప్రజలు
మొన్న ఫ్యామిలీ.. ఈ నెల పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం.!
మొన్న ఫ్యామిలీ.. ఈ నెల పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదం.!
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..
ఆర్మీ అధికారులను దోచుకుని.. వారి స్నేహితురాళ్లపై అత్యాచారం చేసి..