Bigg Boss Telugu 8: బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ లిస్టు ఇదిగో.. ఆ ఇద్దరిపైనే ఎలిమినేషన్ కత్తి
బిగ్ బాస్ అసలు ఆట మొదలైపోయింది. ఎప్పటిలాగే నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు తిట్టుకంటూ తమకు నచ్చని వాళ్లను నామినేట్ చేశారు. అయితే మొదటి వారం నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్‌కి చీఫ్‌గా ముగ్గురు నిఖిల్, నైనిక, యష్మీ గౌడ నియమితులయ్యారు. దీంతో వీరికి నామినేషన్స్ నుంచి ఇమ్యినిటీ లభించింది. అంతేకాదు వీరి ముగ్గురికి నామినేట్ అయిన ఆరు మంది నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం వచ్చింది
బిగ్ బాస్ అసలు ఆట మొదలైపోయింది. ఎప్పటిలాగే నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు తిట్టుకంటూ తమకు నచ్చని వాళ్లను నామినేట్ చేశారు. అయితే మొదటి వారం నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్‌కి చీఫ్‌గా ముగ్గురు నిఖిల్, నైనిక, యష్మీ గౌడ నియమితులయ్యారు. దీంతో వీరికి నామినేషన్స్ నుంచి ఇమ్యినిటీ లభించింది. అంతేకాదు వీరి ముగ్గురికి నామినేట్ అయిన ఆరు మంది నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం వచ్చింది. అలాగే ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేస్తే అందులో ఒకరిని ఈ ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. అలా ఈ వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లిస్టులో నిలిచారు. 1. నాగ మణికంఠ 2. బెజవాడ బేబక్క 3. పృథ్వీ రాజ్ 4. సోనియా ఆకుల 5. విష్ణు ప్రియ 6. శేఖర్ బాషా.. మొదటి వారం నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. సాధారణంగా ప్రతి సీజన్‌లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్‌కి అందరూ చెప్పే కారణం ఏంటంటే.. కలవడం లేదనే. ఇదే కారణంతో హౌస్‌లో వాళ్లంతా మణికంఠను మూకుమ్మడిగా నామినేష్ చేశారు. అలా నామినేషన్స్ లో మణికంఠకు ఎక్కువ ఓట్లు పడ్డాయి.
ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తే మొదటి వారం ఎలిమినేషన్ కత్తి ప్రధానంగా ఇద్దరిపైనే ఉందని చెప్పుకోవచ్చు. అందులో ఒకరు బెజవాడ బేబక్క అయితే మరొకరు మణికంఠ. ముఖ్యంగా బేజవాడ బేబక్కనే మొదటి వారం ఇంటి నుంచి వెళ్లిపోవచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి ఏడో సీజన్ వరకూ చూస్తే.. తొలివారంలో ఎలిమినేట్ అయిన వాళ్లు.. బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్లే. సింగర్ కల్పన, నటి హేమ, కరాటే కళ్యాణి, షకీలా వీళ్లంతా మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్లే. దీనికి తోడు వీరంతా తొలివారంలో వంట గదిలో గరిటె తప్పిన వాళ్లే. ఇక ఓటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం విష్ణుప్రియ టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అదే సమయంలో బేబక్కకు మాత్రం తక్కువ ఓట్లు పోలవుతున్నాయి. అయితే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై కొన్ని గంటలే గడిచాయి కాబట్టి ఇప్పుడే ఏదీ ఫైనల్ చేయలేం. ఎలిమినేషన్ పై క్లారిటీ రావాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే
నామినేషన్స్ లిస్టులో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.