Bigg Boss 8 Telugu Promo 2: కిర్రాక్ సీత వర్సెస్ నిఖిల్.. హీటెక్కించే మాటల యుద్ధం.. కొట్టుకున్నంత పనిచేశారుగా..
శేఖర్ భాషాను మణికంఠ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత ప్రేరణ, సోనియా ఆకుల మధ్య కూడా మాటల తూటాయి పేలాయి. అయితే తొలివారం ఎక్కువగా నామినేషన్స్ పడింది మాత్రం నాగ మణికంఠకే. తాజాగా విడుదలైన బిగ్‌బాస్ సెకండ్ ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్స్ కొట్టుకున్నంత పనిచేశారు.
బిగ్‌బాస్ హౌస్‌లో తొలివారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నారు కంటెస్టెంట్. మొదటిరోజే తిట్టుకోవడం.. అరుచుకోవడం స్టార్ట్ చేశారు. ఇక నామినేషన్స్‌లో మాత్రం రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం విడుదలైన మొదటి ప్రోమోలో మణికంఠ వర్సెస్ శేఖర్ బాషా మధ్య ఏ రేంజ్ లో ఫైట్ జరిగింది. ఈ ప్రాసెస్ లో నిఖిల్, యష్మీ గౌడ, నైనిక ముగ్గురు చీఫ్ లు కాగా.. వీరికి నామినేషన్స్ ఉండవు. ఇక మొదటివారమే నాగ మణికంఠకు నామినేషన్స్ గుద్ది పారేశారు హౌస్మేట్స్. అతడు ఎవరితో కలవడం లేదని.. ఒంటరిగా ఉంటున్నాడని.. అసలు మాట్లాడం లేదంటూ ప్రతి ఒక్కరూ అదే రీజన్ చెప్పారు. శేఖర్ భాషాను మణికంఠ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత ప్రేరణ, సోనియా ఆకుల మధ్య కూడా మాటల తూటాయి పేలాయి. అయితే తొలివారం ఎక్కువగా నామినేషన్స్ పడింది మాత్రం నాగ మణికంఠకే. తాజాగా విడుదలైన బిగ్‌బాస్ సెకండ్ ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్స్ కొట్టుకున్నంత పనిచేశారు.
ఎప్పుడూ ఒంటరిగా ఉండే నాగ మణికంఠ సోఫాలో నిద్రలోకి జారుకున్నాడు. కుక్కలు అరవడంతో హౌస్మేట్స్ మొత్తం అతడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నామినేషన్స్‌లో నబీల్ అఫ్రిది నేరుగా నాగ మణికంఠను నామినేట్ చేశాడు. ఒంటరిగా కూర్చుంటున్నాడు.. కెమెరాతో మాట్లాడుతున్నాడు రీజన్ చెప్పడంతో కౌంటరిచ్చాడు నాగ మణికంఠ. ఒంటరిగా కూర్చుని పాటలు పాడుతున్నాను అంటూ మణికంఠ చెప్పడంతో వచ్చింది పాటలు పాడటానికి కాదంటూ మళ్లీ కౌంటరిచ్చాడు నబీల్. ఇక ఆ తర్వాత శేఖర్ భాషా.. బేబక్కను నామినేట్ చేశాడు. అలాగే నాగ మణికంఠను నామినేట్ చేయడంతో. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఆ తర్వాతే అసలు గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత నటుడు పృథ్వీరాజ్ కిచెన్ లో ఎవరికీ హెల్ప్ చేయడం లేదంటూ పృథ్వీరాజ్ ను నామినేట్ చేయడంతో మధ్యలోకి దూరిపోయింది కిర్రాక్ సీత.
నిన్న గిన్నెలు కడిగాడక్క అంటూ మధ్యలో మాట్లాడటంతో వద్దని వారించాడు నిఖిల్. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ అని నిఖిల్ అరవడంతో నా ఇష్టం మాట్లాడుతాను అంటూ కోపంతో విరుచుకుపడింది కిర్రాక్ సీత. ఇద్దరి మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడిచింది.
బిగ్‌బాస్ ప్రోమో 2 చూసేయ్యండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.