Brahmamudi, September 4th Episode: నిర్దోషిగా ఇంటికి వచ్చిన రాహుల్.. అపర్ణను చంపేందుకు స్కెచ్ రెడీ..

ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్‌లో.. పెద్దావిడ, పెద్దాయనకు వెళ్లి రుద్రాణి.. రాహుల్‌ని విడిపించాలని అడుగుతుంది. అది మాత్రం జరగదని ఎంత పెద్ద బాధ్యత అప్పజెప్పానో అర్థమైందా? అవేమీ పట్టించుకోకుండా.. వాడు స్వార్థం కోసం చూసుకుంటాడా? అస్సలు వాడిని విడిపించి తీసుకొచ్చేదే లేదని సీతారామయ్య అంటాడు. కనీసం నా మొహం చూసి అయినా క్షమించాలని రుద్రాణి అంటే.. నీ మొహం వాడిని అస్సలు క్షమించాలని లేదు. తల్లిగా వాడిని దారిలో పెట్టాల్సింది పోయి..

Brahmamudi, September 4th Episode: నిర్దోషిగా ఇంటికి వచ్చిన రాహుల్.. అపర్ణను చంపేందుకు స్కెచ్ రెడీ..
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us

|

Updated on: Sep 04, 2024 | 1:06 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పెద్దావిడ, పెద్దాయనకు వెళ్లి రుద్రాణి.. రాహుల్‌ని విడిపించాలని అడుగుతుంది. అది మాత్రం జరగదని ఎంత పెద్ద బాధ్యత అప్పజెప్పానో అర్థమైందా? అవేమీ పట్టించుకోకుండా.. వాడు స్వార్థం కోసం చూసుకుంటాడా? అస్సలు వాడిని విడిపించి తీసుకొచ్చేదే లేదని సీతారామయ్య అంటాడు. కనీసం నా మొహం చూసి అయినా క్షమించాలని రుద్రాణి అంటే.. నీ మొహం వాడిని అస్సలు క్షమించాలని లేదు. తల్లిగా వాడిని దారిలో పెట్టాల్సింది పోయి.. అడ్డ దారులు తొక్కుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావ్? ఇప్పుడు వాడితో పాటు ఈ ఇంటిని పరువును కూడా గంగలో కలిపేశాడు. ఇదంతా చూస్తూ ఎలా క్షమించమంటావ్. మేము విడిపించడం కాదు కదా.. ఈ ఇంట్లో ఎవరైనా విడిపించాలని చూస్తే ముందు అడ్డుకునేది నేనే అని అంటుంది ఇందిరా దేవి. వీళ్లను నమ్ముకుని లాభం లేదు. ఈ ఏడుపు ఏదో ఆ రాజ్ దగ్గర ఏడిస్తే వాడు కరిగిపోతాడు. రాహుల్‌ని విడిపిస్తాడని మనసులో అనుకుంటుంది రుద్రాణి.

రాజ్ దగ్గరకు వచ్చి రుద్రాణి నాటకాలు..

ఇక అనుకున్నట్టు గానే రాజ్ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. రాజ్ అని పిలుస్తుంది రుద్రాణి. రాజ్ చూసి ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఏంట్రా కనీసం ఏంటి అని కూడా అడగడం లేదు. రాహుల్ ఈ తప్పు చేసి ఉండడు రా అని అంటుంది. అయితే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పు. విడుదల చేస్తారని రాజ్ అంటాడు. నా సాక్ష్యం చెల్లదు కదా.. నువ్వు తలుచుకుంటే వాడిని ఎలాగైనా విడిపించవచ్చు కదా అని రుద్రాణి అంటే.. వాడు నిర్దోషి అని నువ్వు నమ్ముతున్నావ్ కదా.. అయితే కోర్టు కూడా శిక్ష వేయదు. నిర్దోషి అని విడుదల చేస్తారని అంటాడు. నాది అసలే తల్లి ప్రాణం. మాతృ హృదయం తల్లడిల్లి పోతుంది. నా గురించి అయినా కాస్త ఆలోచించి రాహుల్ విడిపించడానికి ఏదైనా మార్గం ఉందేమో చూడరా అని రాజ్ మనసు మార్చాలని చూస్తుంది రుద్రాణి. కానీ ఏమీ పట్టించుకోని రాజ్.. తప్పు వాడిది కాదు నీదే. ముందే వాడు తప్పు చేసినప్పుడు దండించి ఉంటే.. ఇప్పుడు ఇలా అన్నం పెట్టే ఇంటికి కన్నం వేయడని రాజ్ అంటాడు.

రాహుల్‌ని విడిపించాలని రుద్రాణి విన్నపాలు..

ఇప్పుడు వాడిని విడిపిస్తే ఆ తర్వాత తప్పు చేయకుండా చూసుకుంటాడు. కనీసం స్వప్న ముఖం చూసి అయినా వాడిని విడిపించాలని నటిస్తూ ఏడుస్తుంది రుద్రాణి. ఇక అప్పుడే అపర్ణ వస్తుంది. ఏంటి లోపల వేసిన అస్త్రాలు అన్నీ విఫలం అయ్యాయని ఇక్కడికి వచ్చి చివరి బాణం వేస్తున్నావ్? అని అంటుంది. అందరూ నీ అంత కఠినంగా ఉండరు కదా వదినా.. రాజ్ ఇంట్లోని అందరి మంచి కోరుకుంటాడని రుద్రాణి అంటుంది. అలాగా.. ఇప్పుడు నా కొడుకు మనసు మంచిదని అంటున్నావా? మరి నీ కొడుకు నా కొడుకు మీద వేసిన నింద వేసినప్పుడు నువ్వు ఏం మాట్లాడావో మర్చిపోయావా.. కనీసం మేనల్లుడు అని కూడా జాలి చూపించలేదు. అసలు ఏ మొహం పెట్టుకుని ఇక్కడి వచ్చావు? ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం ఉంటే నీ కొడుకు ఇంత మోసం చేసేవాడా? మావయ్య గారు నా కొడుకును కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి.. ఆ స్థానంలో నీ కొడుకును కూర్చొబెడితే.. ఎంత నమ్మకంగా పని చేయాలి? అడగడానికి ఎవరూ లేరని అడ్డ దారులు తొక్కితే ఇదే గతి పడుతుందని అపర్ణ అంటుంది.

ఇవి కూడా చదవండి

బిర్యానీ తిన్న స్వప్న..

ఇదే తప్పు నీ కొడుకు చేస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావా వదినా అని రుద్రాణి అంటుంది. అసలు నా కొడుకు ఎలాంటి తప్పే చేయడు. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే దొంగలకు శిక్ష పడితేనే బుద్ధి వస్తుందని అపర్ణ అంటుంది. నువ్వు రారా అని రాజ్‌ని తీసుకెళ్తుంది అపర్ణ. దీంతో దుగ్గిరాల కుటుంబం అంతా నాశనం అయిపోవాలని తిట్టుకుంటుంది రుద్రాణి. కట్ చేస్తే.. హాలులో స్వప్న బిర్యానీ తింటూ ఉంటుంది. అసలు నువ్వు మనిషేనా నీ మొగుడు జైలుకు వెళ్తే.. ఇలా కూర్చొని తింటున్నావా? అని రుద్రాణి అంటే.. నువ్వు కూడా అరెస్ట్ అయి ఉంటే.. ఈ మొత్తం బిర్యానీ కూడా తినేస్తానని అంటుంది. ఛీ అనుకుంటూ వెళ్తుంది రుద్రాణి.

నిర్దోషిగా ఇంటికి వచ్చిన రాహుల్.. రెచ్చిపోయిన రుద్రాణి..

ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో.. అందరూ హాలులో ఉంటారు. మళ్లీ పోలీసులు ఇంటికి వస్తారు. దీంతో అందరూ కంగారు పడతారు. రాహుల్ ఇంటికి వస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. రాహుల్ వచ్చాక ఆనందంతో మురిసి పోతుంది రుద్రాణి. ఇతను రిలీజ్ అయి వస్తున్నాడా? లేక ఏదైనా ఎంక్వైరీకి తీసుకొస్తున్నారా? అని స్వప్న అడుగుతుంది. న్యాయమే జరిగింది మమ్మీ.. నేను నిర్దోషిని తెలిసి పోలీసులే విడుదల చేశారని రాహుల్ అంటాడు. నిజమేనా? అని రుద్రాణి అంటే.. ఈ విచిత్రం ఎలా జరిగిందని స్వప్న అంటుంది. ఏం మాయ చేశాడు? ఎంతకు బేరం కుదుర్చుకుని బయట పడ్డాడని అపర్ణ అంటుంది. అలాంటిదేమీ లేదు.. ఇతను పేరు యూజ్ చేసుకుని బయట వాళ్లు ఎవరో ఫ్రాడ్ చేశారు. వాళ్లు ఎవరో ట్రేస్ చేసి పట్టుకున్నాం. సారీ రాంగ్ ఇన్ ఫర్మేషన్‌తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని పోలీసులు వెళ్లిపోతారు. ఇక రుద్రాణి రెచ్చిపోతుంది.

రుద్రాణికి గడ్డి పెట్టిన కావ్య..

సీతా రామయ్యను, ఇందిరా దేవిని, అపర్ణను, రాజ్‌ని, స్వప్నను అందరినీ నిందించి.. తన భాషలో ఏకిపారేస్తుంది. ఇక రుద్రాణికి గట్టి సమాధానం ఇస్తుంది కావ్య. ఆగండి.. ఏంటీ రెచ్చిపోతున్నారు. ఇంత సేపూ ఏకపాత్రాభినయం చేసి.. ఇంట్లోని వాళ్లను తిట్టి అలిసి పోయి ఉంటారు. ఇల్లు అలకగానే పండగ కాదు.. కొడుకు ఇంటికి తిరిగి ఇంటికి వచ్చినంత మాత్రాన నిర్దోషి కాదు. మీ మంతనాలు, మతలబలు.. ఇక్కడ అందరికీ తెలుసు. ఇది ఇంతటితో ముగిసిపోయినది కాదు.. గునపం పట్టుకుని తవ్వితే నీ కొడుకు బాగోతాలు అన్నీ బయట పడతాయి. ఏం అనుకుంటున్నారు? నా భర్తని, అత్తని, ఈ ఇంటి పెద్దల్ని ఏకరువు పెట్టి విమర్శిస్తున్నారు ఏంటి? ఇప్పుడు బయట పడ్డా.. ఇక ముందు ఏం చేసినా దొరికిపోతాడు. నిన్న దొరికిన సాక్ష్యాలు ఎందుకు రంగు మారిందో.. ఒక్కొక్కటి బయటకు తీస్తాను. ముందుందు ముసళ్ల పండగ అని కావ్య.. రుద్రాణికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. దీంతో స్టాపిట్ కళావతి అని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!