Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి నాగ చైతన్య, శోభిత.. ఆ స్పెషల్ డేనే జంటగా ఎంట్రీ ఇవ్వనున్న లవ్ బర్డ్స్

గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో పెద్దగా తెలిసిన ముఖాలు లేవు. విష్ణుప్రియ, నటుడు అభయ్ నవీన్ మాత్రమే కాస్త బాగా పరిచయం ఉన్న ముఖాలు. అయితే కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉన్నా ఇంట్లోకి వెళ్లిన మొదటి రోజు నుంచే గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి నాగ చైతన్య, శోభిత.. ఆ స్పెషల్ డేనే జంటగా ఎంట్రీ ఇవ్వనున్న లవ్ బర్డ్స్
Bigg Boss Telugu 8
Follow us

|

Updated on: Sep 04, 2024 | 4:01 PM

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా మొదలైపోయింది. ఎనిమిదో సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి హౌస్‌లోకి సోలోగా కాకుండా జంటలుగా వెళ్లారు. అయితే గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో పెద్దగా తెలిసిన ముఖాలు లేవు. విష్ణుప్రియ, నటుడు అభయ్ నవీన్ మాత్రమే కాస్త బాగా పరిచయం ఉన్న ముఖాలు. అయితే కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉన్నా ఇంట్లోకి వెళ్లిన మొదటి రోజు నుంచే గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నామినేషన్స్ అయితే హీటెక్కిపోయాయి. కంటెస్టెంట్స్ అరుపులు, కేకలతో బిగ్ బాస్ హౌస్ దద్దరల్లిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పైనే ఉంది. ఈ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారట. సాధారణంగా ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో సినీ సెలబ్రిటీలు బిగ్ బాస్ కు వస్తుంటారు. కంటెస్టెంట్స్ తో కలివిడిగా మాట్లాడుతుంటారు. అలా నాగా చైతన్య, శోభిత కూడా బిగ్ బాస్ హౌస్ లోకి గెస్టులుగా వెళ్లనున్నారని సమాచారం

నాగ చైతన్య, శోభితల ఎంట్రీ కోసం బిగ్‌బాస్ మేకర్స్ ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట. వినాయక చవితి పండుగ రోజున ఈ ప్రేమ పక్షులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళతారని సమాచారం. కంటెస్టెంట్స్‌ను కలిసి మాట్లాడడం, వారిని టాస్కులు బాగా ఆడేందుకు అవసరమైన బూస్టప్ ఇవ్వడం కోసం నాగ చైతన్య, శోభితలు గెస్టులుగా హౌస్ లోకి రానున్నట్లు టాక్. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. ఇదే నిజమైతే బిగ్ బాస్ మరింత కలర్ ఫుల్ గా మారనుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు, అభిమానులు కూడా నాగ చైతన్య, శోభితలు హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

నాగ చైతన్య, శోభితలు ఆగస్టు 8న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.