Bigg Boss 8 Telugu Promo 2: బిగ్‏బాస్ ప్రోమో 2 రిలీజ్.. ఆ ఇద్దరిపై పృథ్వీ ఫైర్.. హీటెక్కిన డిస్కషన్..

ఇక ఈరోజు విడుదలైన మొదటి ప్రోమోలో మరోసారి తన లైఫ్ స్టోరీ చెబుతూ అందరినీ ఏడిపించేశాడు మణికంఠ. దీంతో యష్మీ సహా అమ్మాయిలందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో అసలు హౌస్ లో ఉండేందుకు మణికంఠ పనికిరాడంటూ పైర్ అయ్యాడు పృథ్వీ. సింపథీ గేమ్ ఆడుతున్నాడంటూ చెప్పుకొచ్చాడు. మొదటి రోజు నుంచి హౌస్ లో సైలెంట్ గా ఉంటూ వచ్చిన పృథ్వీ మొత్తానికి నామినేషన్స్ లో మాత్రం గట్టిగానే సీరియస్ అయ్యాడు.

Bigg Boss 8 Telugu Promo 2: బిగ్‏బాస్ ప్రోమో 2 రిలీజ్.. ఆ ఇద్దరిపై పృథ్వీ ఫైర్.. హీటెక్కిన డిస్కషన్..
Bigg Boss 8 Telugu Promo 2
Follow us

|

Updated on: Sep 04, 2024 | 4:48 PM

బిగ్‏బాస్ తెలుగు సీజన్ 8 తొలి వారం నామినేషన్ రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వారమే కంటెస్టెంట్స్ మధ్య హీట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి ఒంటరిగా ఉంటున్న నాగ మణకంఠను నామినేట్ చేస్తున్నారు హౌస్మే్ట్స్. ఎవరితోనూ కలవడం లేదు.. ఎవరేం మాట్లాడినా తనకే ఆపాదించుకుంటున్నాడని అసలు విషయాలు బయటపెట్టారు. ఇక ఈరోజు విడుదలైన మొదటి ప్రోమోలో మరోసారి తన లైఫ్ స్టోరీ చెబుతూ అందరినీ ఏడిపించేశాడు మణికంఠ. దీంతో యష్మీ సహా అమ్మాయిలందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో అసలు హౌస్ లో ఉండేందుకు మణికంఠ పనికిరాడంటూ పైర్ అయ్యాడు పృథ్వీ. సింపథీ గేమ్ ఆడుతున్నాడంటూ చెప్పుకొచ్చాడు. మొదటి రోజు నుంచి హౌస్ లో సైలెంట్ గా ఉంటూ వచ్చిన పృథ్వీ మొత్తానికి నామినేషన్స్ లో మాత్రం గట్టిగానే సీరియస్ అయ్యాడు.

ముందుగా అభయ్ మాట్లాడుతూ.. హౌస్ లో ఎవరు ఏం చేసినా నేను చూస్తా.. అది నా పాయింట్ కాకపోయినా నేను మాట్లాడతాను అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చాడు. ఎవడు ఫేక్ గా ఉన్నాడు.. ఎవడు మంచిగా ఉన్నాడు.. ఎవడు ఒరిజినల్ అనేది అడియన్స్ చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి మణికంఠకు కౌంటరిచ్చింది. మీ పాస్ట్ చెప్పేసి బాధపడితే మేము ఏమైపోం అంటూ సీరియస్ అయ్యింది. దీంతో నేను గేమర్ గానే వచ్చా అని మణికంఠ అనడంతో అభయ్ క్లాప్స్ కొట్టి ఇది నీ గేమ్ ప్లాన్ అని ఒప్పుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నా అంటూ క్లాప్స్ కొట్టడంతో మణికంఠ షాక్ అయ్యాడు.

ఆ తర్వాత మణికంఠ వర్సెస్ పృథ్వీ . వీరిద్దరి మధ్య హీటా డిస్కషన్ నడిచింది. ముందుగా బేబక్కను నామినేట్ చేశాడు. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేస్తూ అతడు ఈ హౌస్ లో ఉండటానికే పనికి రాడని.. సింపథీ గేమ్ ఆడుతున్నాని ఫైర్ అయ్యాడు. అసలు నువ్వే ఓ నెగిటివ్ పర్సన్ అంటూ గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు పృథ్వీ. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో మరోసారి నాగ మణికంఠకే ఎక్కువ నామినేషన్స్ పడ్డట్టు తెలుస్తోంది.

బిగ్‏బాస్ ప్రోమో 2: 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.