Jatin Grewal: నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గుర్తున్నాడా? ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నాడో తెలుసా?

'కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట' .. స్నేహానికి సంబంధించిన ఈ సూపర్ హిట్ సాంగ్ ఏ సినిమాలోది అంటే 'నీ స్నేహం' అని చాలా మంది ఠక్కున చెప్పేస్తారు. దివంగత నటీనటులు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లు గా నటించిన సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్.

Jatin Grewal: నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గుర్తున్నాడా? ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నాడో తెలుసా?
Nee Sneham Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 04, 2024 | 4:45 PM

‘కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట’ .. స్నేహానికి సంబంధించిన ఈ సూపర్ హిట్ సాంగ్ ఏ సినిమాలోది అంటే ‘నీ స్నేహం’ అని చాలా మంది ఠక్కున చెప్పేస్తారు. దివంగత నటీనటులు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లు గా నటించిన సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. ముఖ్యంగా ఈ ఫ్రెండ్ షిప్ సాంగ్ అయితే అప్పట్లో యూత్ ను తెగ ఆకట్టుకుంది. 2002లో రిలీజైన నీ స్నేహం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్ ల జోడీకి మంచి పేరు వచ్చింది. అయిదే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది. అదే ఉదయ్ కిరణ్ ప్రాణ స్నేహితుడి రోల్. ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు బాలీవుడ్ యాక్టర్ జతిన్ గ్రేవాల్. ఉదయ్ కిరణ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేని స్నేహితుడి పాత్రలో జతిన్ నటనను అంత ఈజీగా మార్చిపోలేం. అయితే నీ స్నేహం తర్వాత బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో మాత్రమే కనిపించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్‍లో పంజాబీ ఫ్యామిలీలో పుట్టాడు జతి న్ గ్రేవాల్. చండీఘర్‌లో పెరిగిన అతను చదువు పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు. రేమండ్స్, థమ్స్ అప్, లెవీస్, సింథాల్, ఇండిగో నేషన్, తాజ్ హోటల్స్ వంటి యాడ్స్ చేశాడు. కొన్ని పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా కనిపించాడు. రాహుల్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జతిన్.. అనామిక, లవ్ యూ సోనియా, షార్ట్ కట్ రోమియో, ఇంటర్నేషనల్ హీరో వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. అయితే 2016 తర్వాత సినిమాల్లో కనిపించలేదు జతిన్. అదే ఏడాది కరోలినా మాచి అనే మహిళను వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే వ్యాపార వ్యవహరాలు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు జతిన్. సినిమాలకు దూరంగా ఉన్న అతను సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటాడు. అప్పటికీ, ఇప్పటిక అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్.

జతిన్ గ్రేవాల్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!