AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Rohini: ఇండస్ట్రీలో కమిటీని సిద్ధం చేశాం.. వేధింపులు గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి రోహిణి కామెంట్స్..

సినీ పరిశ్రమలో ఎదురవుతున్న చేదు అనుభవాలు, వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు నడికర్‌ సంగం అనే స్టార్‌ సంస్థ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. 2019 నుంచి స్టార్ ఆర్గనైజేషన్ నడికర్ సంఘంలో అంతర్గత కమిటీ పని చేస్తోంది.

Actress Rohini: ఇండస్ట్రీలో కమిటీని సిద్ధం చేశాం.. వేధింపులు గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి రోహిణి కామెంట్స్..
Actress Rohini
Rajitha Chanti
| Edited By: |

Updated on: Sep 09, 2024 | 11:40 AM

Share

మలయాళీ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత నటులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్టిస్టులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో తమ ఇండస్ట్రీలలోనూ ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయాలని కొందరు నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు అడ్డుకునేందుకు నడికర్ సంఘం రంగంలోకి దిగింది. సినీ పరిశ్రమలో ఎదురవుతున్న చేదు అనుభవాలు, వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు నడికర్‌ సంగం అనే స్టార్‌ సంస్థ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. 2019 నుంచి స్టార్ ఆర్గనైజేషన్ నడికర్ సంఘంలో అంతర్గత కమిటీ పని చేస్తోంది. కానీ కమిటీలో పని అంత చురుకుగా లేదు. అనంతరం గతవారం జరిగిన సమావేశంలో పనులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా నటి రోహిణి మాట్లాడుతూ.. మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరస్తులపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తామని.. అలాంటి వేధింపులను ఎదుర్కొన్న మహిళలకు అన్ని రకాల న్యాయ సహాయం అందేలా చూస్తామని నడికార్ సంఘం పేర్కొంది. ఈ కమిటీలో వచ్చే ఫిర్యాదులు నడికర్ సంఘం ద్వారా సైబర్ పోలీసులకు పంపిస్తామని అన్నారు.

వేధింపులను ఎదుర్కొన్న వారు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ-మెయిల్, ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రోహిణి తెలిపారు. బాధితులకు న్యాయసహాయం కూడా అందించనున్నట్లు తెలిపారు. మహిళలకు తమకు ఎదురైన ఇబ్బందులు, అలాగే లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకుండా.. హోం కమిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్ హేమ కమిటీ మలయాళీ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ నివేదికను సిద్ధం చేసింది. క్యాస్టిక్ కౌచ్ నుంచి వివక్ష వరకు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!