Alia Bhatt: అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్.. హీరోయిన్ రియాక్షన్ ఎంటంటే..

తాజాగా ఆదివారం విడుదలైన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో అలియా యాక్షన్ లుక్.. యాక్టింగ్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు గ్లామర్ బ్యూటీగా కనిపించిన అలియా ఈ మూవీ టీజర్ లో మాత్రం యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. వేదాంగ్ రైనాతో కలిసి పోటీ పడి మరి నటించిందంటున్నారు.

Alia Bhatt: అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కామెంట్స్.. హీరోయిన్ రియాక్షన్ ఎంటంటే..
Nag Ashwin, Alia Bhatt
Follow us

|

Updated on: Sep 08, 2024 | 9:42 PM

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘జిగ్రా’. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అలియాతోపాటు వేదాంగ్ రైనా సైతం మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. డైరెక్టర్ వాసన్ బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఓ రేంజ్ ఎక్స్‏పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఆదివారం విడుదలైన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో అలియా యాక్షన్ లుక్.. యాక్టింగ్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు గ్లామర్ బ్యూటీగా కనిపించిన అలియా ఈ మూవీ టీజర్ లో మాత్రం యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. వేదాంగ్ రైనాతో కలిసి పోటీ పడి మరి నటించిందంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జిగ్రా మూవీ టీజర్ చూసిన నాగ్ అలియాను ఉద్దేశిస్తూ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

“వాసన్ బాలా, అలియా భట్.. ఇద్దరు అద్భుతాలు చేశారు. ఇక ఈ సినిమా కోసం ఇంకా వెయిట్ చేయలేము” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ అలియా యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక నాగ్ అశ్విన్ పోస్టుకు అలియా రియాక్ట్ అవుతూ దర్శకుడికి కృతజ్ఞతలు తెలియజేసింది. నాగ్ అశ్విన్‌తో పాటు హన్సల్ మెహత్, అర్జున్ కపూర్, శర్వరీ వాఘ్, అమర్ కౌశిక్, వివేక్ అగ్నిహోత్రి వంటి స్టార్స్ సైతం అలియా యాక్షన్ చిత్రం టీజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన అన్నను కష్టాల నుంచి కాపాడేందుకు ఏదైనా చేయగలిగిన సోదరి కథ ‘జిగ్రా’. టీజర్‌లో, అలియా భట్ తన సోదరుడు వేదంగ్ రైనాను విదేశీ జైలు నుండి విడిపించడానికి పోరాడుతున్నట్లు కనిపించింది.

ఇవి కూడా చదవండి
Alia

Alia

అంతేకాదు.. అదే వీడియోలో తన సోదరుడిని కాపాడుకునేందుకు శత్రువులతో భయంకరంగా పోరాటం చేసింది. సినిమా టీజర్ మొత్తం యాక్షన్, ఎమోషన్స్‌తో నిండిపోయి సంచలనం రేపుతోంది. అలాగే ఈ టీజర్ లో అలియా డైలాగ్స్ మాత్రం హైలెట్ అయ్యాయి. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ‘జిగ్రా’ అక్టోబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో అలియా, వేదాంగ్‌లతో పాటు ఆదిత్య నందా, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..