Vikas Sethi: టీవీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు వికాస్ సేథి మృతి..

వినాయక చవితి సంబరాల్లో ఉన్న ప్రజలు, సినీ తారలు వికాస్ సేథి మరణ వార్త తెలిసి షాకయ్యారు. వికాస్ సేథి ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రార్థించారు. గత రాత్రి వికాస్ సేథి నిద్రపోతున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కానీ అప్పటికే వికాస్ సేథి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Vikas Sethi: టీవీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు వికాస్ సేథి మృతి..
Vikas Sethi
Follow us

|

Updated on: Sep 08, 2024 | 6:57 PM

టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటుడు వికాస్ సేథి కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 48 సంవత్సరాలు. గుండెపోటుతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. వికాస్ సేథి అకాల మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. వినాయక చవితి సంబరాల్లో ఉన్న ప్రజలు, సినీ తారలు వికాస్ సేథి మరణ వార్త తెలిసి షాకయ్యారు. వికాస్ సేథి ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రార్థించారు. గత రాత్రి వికాస్ సేథి నిద్రపోతున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కానీ అప్పటికే వికాస్ సేథి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

వికాస్ సేథి మరణ వార్త తెలిసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు అభిమానులు, సినీతారలు. వికాస్ సేథి చాలా సంవత్సరాలుగా రంగుల ప్రపంచంలో చురుకుగా ఉన్నారు. సీరియల్స్‌లోనే కాకుండా రియాల్టీ షోలలో కూడా కనిపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కియోంకి సాస్ బి కభీ బహు థీ, కసౌతీ జిందగీ కె, కహీ తో హోగా, కె. స్ట్రీట్ పాలి హిల్, హమారీ బెత్యోంకా వివాహ్, దుర్ సబ్కో లగ్తా హై, సంస్కార్ లక్ష్మి, సరురల్ సిమర్ కా వంటి సీరియల్స్‌లో వికాస్ సేథి నటించారు. ‘దీవానాపన్’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘ఆప్స్’, ‘స్మార్ట్ శంకర్’ వంటి సినిమాల్లో కూడా నటించారు.

వికాస్ సేథి 2021లో కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఫిట్‌నెస్‌కు సంబంధించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవాడు. తన సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాడు. వికాస్ సేథికి ఇటీవల ఆర్థిక సమస్యలు వచ్చినట్లు సమాచారం. దాంతో డిప్రెషన్‌లో ఉన్నాడని కూడా చెబుతున్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఇంకా క్లారిటీ రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..