Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్.. అతడి భార్య ఎవరో తెలుసా.. ?

ఆ తర్వాత ఇంట్లో గొడవలు, తల్లి మరణం.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం.. జాబ్, పెళ్లి, భార్య, కూతురు ఇలా తన గురించి అన్ని విషయాలు చెబుతూ ప్రేక్షకులు అందరూ అయ్యో పాపం అనేలా చేశాడు. ఇక హౌస్ లోనూ ఒంటరిగా ఉండడం.. ప్రతిసారి తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఏడవడంతో హౌస్మేట్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్.. అతడి భార్య ఎవరో తెలుసా.. ?
Naga Manikanta
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2024 | 5:16 PM

బిగ్‏బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే వారం రోజులు గడిచింది. మొత్తం 14 మందితో ప్రారంభమైన ఈ షో.. మొదటి రోజు నుంచే గొడవలు, అలకలు, ఏడుపులతో మంచి రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా తొలివారం మొత్తం బిగ్‏బాస్ ఇంట్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయ్యాడు నాగ మణికంఠ. అప్పటివరకు ఎవరికీ తెలియని నాగ మణికంఠ.. తన లైఫ్, గతం గురించి చెబుతూ తన స్పెషల్ వీడియోతోనే అందరిని దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. మొదటి రోజే స్టేజే తన జీవితం గురించి చెబుతూ సింపథీని వర్కౌట్ చేశాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడం.. ఆ తర్వాత తల్లి మరో పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇంట్లో గొడవలు, తల్లి మరణం.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం.. జాబ్, పెళ్లి, భార్య, కూతురు ఇలా తన గురించి అన్ని విషయాలు చెబుతూ ప్రేక్షకులు అందరూ అయ్యో పాపం అనేలా చేశాడు. ఇక హౌస్ లోనూ ఒంటరిగా ఉండడం.. ప్రతిసారి తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఏడవడంతో హౌస్మేట్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు.

తొలి వారం రోజులు ఇంట్లో ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడని హౌస్ మొత్తం అతడినే టార్గెట్ చేసి నామినేట్ చేశారు. దీంతో ఓటింగ్ లో నాగ మణికంఠ టాప్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడిప్పుడే అతడు మారుతున్నాడని. ఎమోషనల్ కాకుండా అందరితో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నాడని హౌస్మేట్స్ కూడా చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్లలో ఉన్న మణికంఠకు జనాలు ఓట్లు గుద్దిపడేశారు. అయితే మొదటి నుంచి తన భార్య గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు నాగ మణికంఠ. తన స్పెషల్ మీడియోలో తన భార్య యూఎస్ నుంచి వెళ్లిపొమ్మన్నదని.. దీంతో తాను ఇండియా వచ్చేశానని చెప్పాడు. దీంతో నాగ మణికంఠ భార్య నెగిటివిటీ పెరిగిపోయింది. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మాట మార్చేశాడు. బిగ్‏బాస్ హౌస్ లోకి రావడానికి తన భార్యే సాయం చేసిందని.. ఇక్కడివరకు రావడానికి తన భార్య ఎంతో ఎంకరేజ్ చేసిందని.. చిన్న చిన్న మనస్పర్థలు తప్ప.. తన భార్యతో ఎలాంటి గొడవలు లేవని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు నాగ మణికంఠ.

ఇవి కూడా చదవండి

నాగ మణికంఠ భార్య గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ట్రై చేశారు. కానీ అతడి ఇన్ స్టాలో భార్య, పెళ్లి ఫోటోస్ ఏమి లేవు. దీంతో అసలు మణికంఠ భార్య ఎవరు అంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా నాగ మణికంఠ పెళ్లి వీడియో ఇదే అంటూ ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. అయితే నాగ మణికంఠతోపాటు అతడి భార్య, ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.