AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi 2024: సల్మాన్ చెల్లెలు ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. గణపతి నిమజ్జన కార్యక్రమలో ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన కండల వీరుడు

సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, బావ ఆయుష్ శర్మ శనివారం తమ ఇంట్లో వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. సల్మాన్ తన మేనకోడలు అయత్‌తో కలిసి హారతి నిర్వహించి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ పూజా కార్యక్రమంలో అర్బాజ్ కుమారుడు అర్హాన్, సోహైల్ కుమారులు నిర్వాన్, యోహాన్‌లతో పాటు సలీం ఖాన్, అర్బాజ్ ఖాన్ , సోహైల్ ఖాన్ తదితర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతేకాదు వరుణ్ శర్మ, ఓర్రీ ,యులియా వంతూర్ వంటి ఇతర ప్రముఖులు కూడా ఈ వేడుకలను హాజరయ్యి సందడి చేశారు.

Vinayaka Chavithi 2024: సల్మాన్ చెల్లెలు ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. గణపతి నిమజ్జన కార్యక్రమలో ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేసిన కండల వీరుడు
Salman Khan Ganesh Puja
Surya Kala
|

Updated on: Sep 09, 2024 | 8:27 AM

Share

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. బాలీవుడ్ తారలు చవితి ఉత్సవాల్లో మునిగిపోయారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీతో కలిసి ఆదివారం విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో అర్పితా ఖాన్, ఆమె నటుడు-భర్త ఆయుష్ శర్మ, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్, అర్హాన్, నిర్వాన్, అలీజ్ అగ్నిహోత్రితో సహా మొత్తం సల్మాన్ ఖాన్ కుటుంబం వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకుంది.

సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్, బావ ఆయుష్ శర్మ శనివారం తమ ఇంట్లో వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు. సల్మాన్ తన మేనకోడలు అయత్‌తో కలిసి హారతి నిర్వహించి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ పూజా కార్యక్రమంలో అర్బాజ్ కుమారుడు అర్హాన్, సోహైల్ కుమారులు నిర్వాన్, యోహాన్‌లతో పాటు సలీం ఖాన్, అర్బాజ్ ఖాన్ , సోహైల్ ఖాన్ తదితర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతేకాదు వరుణ్ శర్మ, ఓర్రీ ,యులియా వంతూర్ వంటి ఇతర ప్రముఖులు కూడా ఈ వేడుకలను హాజరయ్యి సందడి చేశారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో సల్మాన్ తన మేనకోడలు ఆయత్‌తో కలిసి హారతి చేస్తూ కనిపించాడు. తరువాత అర్బాజ్, సోహైల్ తమ కుమారులతో కలిసి హారతి ఇవ్వడం కనిపించింది.

తాజాగా ప్రస్తుతం సికందర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ కు సినిమా షూటింగ్ సెట్‌లో పక్కటెముకకు గాయమైంది. ఇటీవల ముంబైలో విహారయాత్ర సందర్భంగా సల్మాన్ ఖాన్ తనకు గాయమైన విషయం వెల్లడించాడు. బ్లాక్ సూట్ ధరించి సల్మాన్ గురువారం బిగ్ బాస్ 18 సెట్స్‌లో కనిపించాడు, అక్కడ తన రెండు పక్కటెముకలు విరిగినట్లు వెల్లడించాడు. రెండు పక్కటెముకలు విరిగిపోయాయి, దయచేసి జాగ్రత్తగా ఉండమని తన వైపు వస్తున్న ఫోటోగ్రాఫర్‌లకు విజ్ఞప్తి చేశాడు.

సికందర్‌లో రష్మిక మందన్న, సునీల్ శెట్టి, సత్యరాజ్ ప్రతీక్ పాటిల్ బబ్బర్, చైతన్య చౌదరి , నవాబ్ షా వంటి వారు ప్రముఖ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కు విడుదల కానుంది. సల్మాన్ చివరిసారిగా టైగర్ 3లో కనిపించాడు. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీలతో నటించిన ఈ సినిమాలో సల్మాన్..  అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో కనిపించాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..