చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌.. అయినా కోట్లల్లో రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్ కూడా

చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నా కూడా ఆయన సినిమాలుమాత్రం ఆపడం లేదు. వరుసగా సినిమాలను దింపుతూనే ఉన్నాడు. కొంతమంది హీరోలు.. ఏడాది ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే ఆ హీరో మాత్రం ఏకంగా ఐదు ఆరు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కానీ ఆ సినిమాలు థియేటర్స్ లో బోల్తాకొడుతున్నాయి.

చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌.. అయినా కోట్లల్లో రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్ కూడా
Hero
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2024 | 1:24 PM

హిట్స్, ఫ్లాప్స్ లతో సంబంధం లేకుండా  వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు కొందరు హీరోలు. మరికొంతమంది ఎంత ట్రై చేసిన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరో కూడా అదే కోవలోకి వస్తాడు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నా కూడా ఆయన సినిమాలుమాత్రం ఆపడం లేదు. వరుసగా సినిమాలను దింపుతూనే ఉన్నాడు. కొంతమంది హీరోలు.. ఏడాది ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే ఆ హీరో మాత్రం ఏకంగా ఐదు ఆరు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కానీ ఆ సినిమాలు థియేటర్స్ లో బోల్తాకొడుతున్నాయి. అయితే ఆయన ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఆయన ఎక్కడ తగ్గడం లేదు. నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

బాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అక్షయ్ కుమార్. ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయి. యాక్షన్ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యాడు అక్షయ్. ఆ తర్వాత కామెడీ సినిమా చేశాడు. ఇప్పుడు ఆయన చేసే సినిమాలే వేరు. సమాజానికి సందేశం అందించేందుకు కృషి చేస్తున్నాడు అక్షయ్. ఈరోజు (సెప్టెంబర్ 9) ఆయన పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన వయసు 57 ఏళ్లు. ఇంతకీ అక్షయ్ కుమార్ మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఎంత సంపాదించాడు.? అనేది ఓ సారి చూద్దాం.!

ఇది కూడా చదవండి : Murali Sharma: మురళీ శర్మ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె కూడా చాలా ఫెమస్ నటి

అక్షయ్ కుమార్ ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందించాడు. అయితే ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. వరుసగా ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నారు. అయితే ఆయన ఆస్తులు రూ. 2500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రతిసారీ అత్యధిక పన్నులు చెల్లించే హీరోల్లో అక్షయ్ ఒకరు. అక్షయ్ కుమార్ ప్రతి సినిమాకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోడు. రూ. 60 కోట్ల నుంచి రూ. 140 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న రికార్డ్ ఉంది. రీసెంట్ గా రిలీజైన ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాకు 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు. అలాగే అక్షయ్ అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఇందుకోసం ఆయన రూ. 6 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. అలాగే జుహులో అక్షయ్ కుమార్‌కు విలాసవంతమైన ఇల్లు ఉంది. అక్షయ్ తన భార్య ట్వింకిల్ ఖన్నా, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. దీని విలువ రూ. 60 కోట్ల రూపాయలు. అంతేకాకుండా గోవాలో 5 కోట్ల రూపాయల విలువైన విల్లా కూడా ఉంది.

ఇది కూడా చదవండి :Tamannaah Bhatia: అబద్ధాలతో జీవించలేను.. అతనికి చాలా ఇచ్చాను.. తమన్నా బ్రేకప్ స్టోరీ

అక్షయ్ దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. అతని వద్ద 10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ పాంథమ్, రూ. 3 కోట్ల విలువైన బెంట్లీ ఉన్నాయి. ఇవి కాకుండా మెర్సిడెస్ బెంజ్, పోర్షా సహా అనేక కార్లు ఉన్నాయి. రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా అక్షయ్‌కి ఉంది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘స్కై ఫోర్స్‌’, ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’, ‘హేరా ఫెయిరీ 3’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే సింగం ఎగైన్, ‘జాలీ ఎల్‌ఎల్‌బి 3’ సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!