- Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary upcoming movies and shooting updates on september 2024, details here Telugu actress Photos
Meenakshi Chaudhary: చేతినిండా సినిమాలు ఉన్నా ఏం లాభం.! కెరియర్ కి నో యూజ్ ఆ..
చేతినిండా సినిమాలున్నా.. అవసరమైనపుడు అవి యూజ్ కావట్లేదు. పెద్ద సినిమాలే చేస్తున్నా.. కెరీర్‌కు పెద్దగా యూజ్ కావట్లేవవి. సౌత్‌లో ఓ హీరోయిన్ పరిస్థితిదే ఇప్పుడు. అసలు తప్పెక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. పోనీ ఆఫర్స్ లేవా అంటే.. ఇప్పటికీ చేతినిండా సినిమాలున్నాయి. మరి ఇలాంటి చిత్రమైన పొజిషన్‌లో ఉన్న భామ ఎవరు..? చాప కింద నీరులా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.
Updated on: Sep 09, 2024 | 2:06 PM

చేతినిండా సినిమాలున్నా.. అవసరమైనపుడు అవి యూజ్ కావట్లేదు. పెద్ద సినిమాలే చేస్తున్నా.. కెరీర్‌కు పెద్దగా యూజ్ కావట్లేవవి.

సౌత్‌లో ఓ హీరోయిన్ పరిస్థితిదే ఇప్పుడు. అసలు తప్పెక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు. పోనీ ఆఫర్స్ లేవా అంటే.. ఇప్పటికీ చేతినిండా సినిమాలున్నాయి.

మరి ఇలాంటి చిత్రమైన పొజిషన్‌లో ఉన్న భామ ఎవరు..? చాప కింద నీరులా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.

మొదట్లో ఒకట్రెండు ఫ్లాపులొచ్చినా.. హిట్ 2తో కెరీర్ ట్రాక్ ఎక్కింది. కానీ వచ్చిన క్రేజ్‌ను వాడుకోవడంలో ఈ భామ ఫెయిల్ అవుతుందనే విమర్శలొస్తున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. గుంటూరు కారం, గోట్ లాంటి పెద్ద సినిమాల్లో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు మీనాక్షి. స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ రావడంతో.. కనీసం కథ కూడా వినట్లేదని మీనాక్షిపై ట్రోలింగ్ మొదలైంది.

గుంటూరు కారంలో జస్ట్ ఉన్నారంటే ఉన్నారనే పాత్ర చేసిన ఈ భామ.. గోట్‌లోనూ పాటలు, మూడు సీన్స్‌కే పరిమితం అయిపోయారు. ఇదే కంటిన్యూ అయితే.. కెరీర్‌లో గ్రోత్ కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి కెరీర్ ఇప్పటికైతే సేఫ్ జోన్‌లోనే ఉంది.

ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, చిరంజీవి విశ్వంభర, వరుణ్ తేజ్ మట్కా సినిమాలలో నటిస్తున్నారు. ఇవన్నీ హిట్టై.. అందులో కారెక్టర్ కూడా పేలితే అమ్మడి దశ తిరగడం ఖాయం. చూడాలిక.. ఏం జరుగుతుందో..?




