- Telugu News Photo Gallery Cinema photos Ottesi Cheputunna Movie Actress Kaniha Shares Burned Face Photos
Actress Kaniha: అరెరే..! ఈ హీరోయిన్‌కు ఏమైంది.. ఒక్కసారిగా ఊహించని విధంగా.. ముఖం నిండా కాలిన గాయాలు..
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించిన ఒట్టేసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కనిహా. తమిళనాడుకు చెందిన ఆ అందాల తార ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒట్టేసి చెబుతున్నా తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రంలో రవితేజ భార్యగా కనిపించింది.
Updated on: Sep 08, 2024 | 10:08 PM

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించిన ఒట్టేసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కనిహా. తమిళనాడుకు చెందిన ఆ అందాల తార ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒట్టేసి చెబుతున్నా తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రంలో రవితేజ భార్యగా కనిపించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో నటించి చాలా ఫేమస్ అయ్యింది.

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కనిహా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ పాత్రలు పోషిస్తుంది. ప్రస్తుతం తమిళంలో బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. అయితే తాజాగా కనిక షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ షాకవుతున్నారు.

అందులో కనిహా ముఖం మొత్తం కాలినట్లుగా కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అయితే కనిహా ఇటీవల విజయ్ సేతుపతి నటించిన గోట్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన లుక్ ఇది.

2001లో మిస్ చెన్నై అందాల పోటీలో కనికా 2వ రన్నరప్‌గా నిలిచింది. 2002లో సుసి గణేశన్ దర్శకత్వం వహించిన ఫైవ్ స్టార్ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2008లో శ్యామ్ రాధాకృష్ణన్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.




