- Telugu News Photo Gallery Cinema photos Lokesh Kanagaraj taking caring about rajinikanth coolie movie
లోకీ యూనివర్స్ అంతకుమించి.. కూలీ మూవీపై పెరుగుతోన్న అంచనాలు
మన బలహీనతల గురించి ఎంతమంది అయినా మాట్లాడవచ్చు. కానీ మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి. అది అర్థమైతే సగం సక్సెస్ వచ్చేసినట్టు అని అంటుంటారు కదా... అందుకే ముందు నేను బలాల గురించి స్టడీ చేశానని చెబుతున్నారు లోకేష్ కనగరాజ్. తన సినిమాలను స్టడీ చేస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని చెబుతున్నారు ఈ కెప్టెన్. మాస్టర్ సినిమా చేసే టైమ్‌కే డైరక్టర్‌గా మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది లోకేష్‌కి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Sep 08, 2024 | 7:36 PM

మన బలహీనతల గురించి ఎంతమంది అయినా మాట్లాడవచ్చు. కానీ మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి. అది అర్థమైతే సగం సక్సెస్ వచ్చేసినట్టు అని అంటుంటారు కదా... అందుకే ముందు నేను బలాల గురించి స్టడీ చేశానని చెబుతున్నారు లోకేష్ కనగరాజ్. తన సినిమాలను స్టడీ చేస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని చెబుతున్నారు ఈ కెప్టెన్.

మాస్టర్ సినిమా చేసే టైమ్‌కే డైరక్టర్‌గా మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది లోకేష్‌కి. విజయ్‌తో సినిమా అనగానే.. అందరూ వావ్ అనుకునే టైమ్‌లో, విజయ్‌నీ, విజయ్ సేతుపతీని కలిపి ఆయన చేసి మాస్టర్ వేరే లెవల్‌లో క్రేజ్ క్రియేట్ చేసింది. ఆ టైమ్‌లో విక్రమ్‌తో మరో అడుగు ముందుకేశారు ఈ కెప్టెన్.

కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్... అంటూ తన ఆర్టిస్టుల సెలక్షన్‌ని మాలీవుడ్‌కి ఎక్స్ పాండ్ చేశారు. ఇంత గ్రిప్పింగ్‌గా కమల్‌కి సక్సెస్‌ఫుల్ మూవీని ఇచ్చిన కెప్టెన్ వైపు నార్త్ వాళ్లు కూడా తిరిగి చూశారు. లియో మూవీ టైమ్‌లో ప్యాన్ ఇండియా రేంజ్‌లో వైరల్ అయింది లోకేష్ పేరు.

ఇప్పుడైతే లోకేష్ జస్ట్ పేరు కాదు... అదో బ్రాండ్. ఆయన చేసే సినిమా ఓన్ యూనివర్శ్‌లో ఉంటుందా? సరికొత్తగా ఏమైనా చేస్తున్నారా? అని జనాలందరూ తలలు తిప్పి చూసేలా ఉంది సిట్చువేషన్. అందుకే కూలీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

తెలుగు నుంచి నాగార్జునను, కన్నడ నుంచి ఉపేంద్రను కూడా రంగంలోకి దింపారు. కమల్‌కి అంత భారీ హిట్ ఇచ్చిన కెప్టెన్ సూపర్‌స్టార్‌కి ఇంకెలాంటి సక్సెస్ ఇస్తారనే ఎదురుచూపులూ ఎక్కువగా ఉన్నాయి... వాటిని ఎలాగైనా రీచ్ కావాలన్నదే లోకేష్ ముందున్న గోల్.





























