Murali Sharma: మురళీ శర్మ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె కూడా చాలా ఫెమస్ నటి

ఎన్నో అద్భుతమైన పాత్రలో మెప్పించాడు ఈ విలక్షణ నటుడు. విలన్ గా మెప్పించిన మురళి శర్మ.. తండ్రి పాత్రల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. అలా వైకుంఠపురం లో సినిమాలో మురళీ శర్మ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించారు.

Murali Sharma: మురళీ శర్మ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె కూడా చాలా ఫెమస్ నటి
Murli Sharma
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 09, 2024 | 10:19 AM

సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకొక్కసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాల్లో కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు మురళీశర్మ. ఎన్నో అద్భుతమైన పాత్రలో మెప్పించాడు ఈ విలక్షణ నటుడు. విలన్ గా మెప్పించిన మురళి శర్మ.. తండ్రి పాత్రల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. అలా వైకుంఠపురం లో సినిమాలో మురళీ శర్మ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించారు.

మురళీ శర్మ టీవీ సీరియల్స్‌లో నటించి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చారు. మురళీ శర్మ ముందుగా హిందీ సినిమా రాజ్ లో నటించారు. ఆ తర్వాత  షారుఖ్‌ఖాన్ మైహూనా లో నటించాడు. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు మురళీ శర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఈ వర్సటైల్ యాక్టర్.

మురళీశర్మనే కాదు ఆయన భార్య కూడా సినిమాల్లో నటిస్తారు. ఆమె కూడా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మురళీ శర్మ భార్య పేరు.. అశ్వినీ కల్‌శేఖర్. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే. ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అశ్వినీ కల్‌శేఖర్ మరాఠీ టెలివిజన్, హిందీ సినిమా, టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు. తెలుగులో అల్లు అర్జున్ బ్రదినాథ్ సినిమాతో పాటు రవి తేజ హీరోగా నటించిన నిప్పు సినిమాలోనూ విలన్ భార్యగా నటించారు అశ్వినీ కల్‌శేఖర్. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలోనూ నటించింది అశ్వినీ కల్‌శేఖర్. ప్రస్తుతం అశ్వినీ కల్‌శేఖర్ హిందీ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. మురళీ శర్మ తెలుగు సినిమాలు చేస్తుంటే.. ఆయన భార్య అశ్వినీ కల్‌శేఖర్ హిందీలో సినిమాలు చేస్తున్నారు.

Murli Sharma Wife

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం