Bezawada Bebakka: అమెరికాలో కోటి రూపాయల ఉద్యోగం.. బిగ్బాస్ కోసం జాబ్ వదిలేసి..
బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజు నుంచి సరదగా కనిపించిన బేబక్క.. అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్, కెరీర్ విషయాలను చెప్పుకొస్తుంది. అమెరికాలో ఉండే బేబక్క.. కొన్నాళ్ల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగ ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. చదువు, జాబ్స్, సంపాదన గురించి చెప్పుకొచ్చింది.
బెజవాడ బేబక్క.. కానీ కొన్నిరోజులుగా బిగ్బాస్ బేబక్క అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. ఈసారి బిగ్బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చి వారానికే హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఈ సీజన్ లో మొదటి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. సింగర్ గా, ఫన్నీ రీల్స్, కామెడీ రీల్స్ తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది బేబక్క.. అలియాస్ మధు. బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లిన మొదటి రోజు నుంచి సరదగా కనిపించిన బేబక్క.. అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఇక ఎలిమినేట్ అయ్యాక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్, కెరీర్ విషయాలను చెప్పుకొస్తుంది. అమెరికాలో ఉండే బేబక్క.. కొన్నాళ్ల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగ ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. చదువు, జాబ్స్, సంపాదన గురించి చెప్పుకొచ్చింది.
తాను స్కూల్, కాలేజీ అన్ని విజయవాడలోనే కంప్లీట్ చేశానని.. చిన్నప్పటి నుంచి చదువులలో మంచి స్టూడెంట్ అని.. ఎంబీఏ పూర్తి చేసిన తాను.. యూనివర్సిటీ టాపర్ కూడా అని చెప్పుకొచ్చింది. లెక్చరర్ గా ఆఫర్ వచ్చినప్పటికీ అమెరికా వెళ్లాలని తనకు వచ్చిన జాబ్ ఆఫర్ కూడా వదిలేసుకొని వచ్చానని తెలిపింది. అమెరికాలో దాదాపు పదేళ్లు జాబ్ చేశానని.. తాను పనిచేసే సంస్థలో తానే యంగెస్ట్ టెస్ట్ లీడ్ అని..దాదాపు కోటి రూపాయల జీతం అని తెలిపింది. తన కంపెనీలో తనకే హయ్యేస్ట్ ప్యాకేజ్ ఇచ్చారని తెలిపింది.
ఇప్పటికే తాను కావాల్సినంత సంపాదించానని.. డబ్బుల కోసమే అమెరికా వెళ్లినా.. ఇప్పుడు ఫ్యాషన్ కోసం ఇటు వచ్చానని తెలిపిందే. అందుకే బిగ్బాస్ ఆఫర్ రాగానే ఒప్పుకొని వచ్చేశానని.. కోటి రూపాయల జీతం వదులుకుని సింగింగ్, యాక్టింగ్ ఫ్యాషన్ తో అమెరికా వదిలేసి వచ్చానని బేబక్క చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు బేబక్క పాప్ సాంగ్స్ యూట్యూబ్ లో వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.