AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: వెన్నులో వణకు పుట్టించే తెలుగు హారర్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఒంటరిగా మాత్రం అసలు చూడొద్దు

ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా జానర్ల కంటే ఇలాంటి సినిమాల కోసమే ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఏదో ఒక హారర్ సినిమాను ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా థియేటర్లలో ప్రేక్షకులకు చెమటలు పట్టించిన ఓ సూపర్ హిట్ హారర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

OTT Movie: వెన్నులో వణకు పుట్టించే తెలుగు హారర్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఒంటరిగా మాత్రం అసలు చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 12, 2024 | 12:00 PM

Share

ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా జానర్ల కంటే ఇలాంటి సినిమాల కోసమే ఆడియెన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఏదో ఒక హారర్ సినిమాను ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా థియేటర్లలో ప్రేక్షకులకు చెమటలు పట్టించిన ఓ సూపర్ హిట్ హారర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. అదే   ‘డిమోంటీ కాలనీ 2. 2015లో తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘డిమోంటీ కాలనీ’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడం, రెండో పార్ట్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు మరింత భయపెట్టేలా ఉండడంతో డిమోంటీ కాలనీ 2 మూవీపై బాగానే బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 15వ తేదీన తమిళంలో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక వారం ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 23న తెలుగులో రిలీజ్ కాగా, ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అజయ్ జ్ఞానమూర్తి తెరకెక్కించిన ఈ సూపర్ హారర్ థ్రిల్లర్ మూవీలో అరుళ్‌ నిధి, ప్రియా భవాని శంకర్, అర్చనా రవిచంద్రన్‌, త్సెరింగ్ దోర్జీ, అరుణ్ పాండియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసిన డిమోంటి కాలనీ 2 ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 20 లేదా 27 వ తేదీల్లో ఏదో ఒక రోజు డిమోంటీ కాలనీ 2 ఓటీటీలోకి రానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. BTG యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై జ్ఞానముత్తు, బాబీ బాలచంద్రన్ సంయుక్తంగా డిమోంటీ కాలనీ 2 ను నిర్మించారు. సామ్ సీఎస్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

డిమోంటీ కాలనీ 2 లో ప్రియా భవానీ శంకర్..

డిమోంటీ కాలనీ 2 ట్రైలర్ ఇదిగో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!