Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadde Naveen: ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడెలా ఉన్నాడు? సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు?

1990-2000వ దశకంలో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన స్టార్ హీరోల్లో వడ్డే నవీన్ కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను అనతి కాలంలోనే మంచి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి హైట్, బాడీ పర్సనాలిటీ, హెయిర్ స్టైల్ తో అప్పట్లో చాలా మంది అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు వడ్డే నవీన్

Vadde Naveen: ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడెలా ఉన్నాడు? సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు?
Vadde Naveen
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2024 | 4:19 PM

1990-2000వ దశకంలో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన స్టార్ హీరోల్లో వడ్డే నవీన్ కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను అనతి కాలంలోనే మంచి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి హైట్, బాడీ పర్సనాలిటీ, హెయిర్ స్టైల్ తో అప్పట్లో చాలా మంది అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు వడ్డే నవీన్. దీనికి తోడు అతను ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే చేయడంతో లేడీ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు వడ్డే నవీన్. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ప్రియ ఓ ప్రియా, చెలికాడు, పెళ్లాడి చూపిస్తా , లవ్ స్టోరీ 1999, మనసిచ్చి చూడు, స్నేహితులు, ప్రేమించే మనసు, మా బాలాజీ, బాగున్నారా, నా హృదయంలో నిదురించే చెలి, నా ఉపిరి ఇలా దాదాపుగా 30 సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు వడ్డే నవీన్. కేవలం హీరోగానే పలు సినిమాల్లో నెగెటివ్ రోల్స్ కూడా పోషించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ప్రేమించే మనసు, చాలా బాగుంది సినిమాల్లో నవీన్ పోషించిన నెగెటివ్ పాత్రలకు మంచి స్పందన వచ్చింది.

వైవాహిక జీవితంలోనూ సమస్యలు.. అందుకే..

2016 వరకు వరుసగా సినిమాలు చేశాడు వడ్డే నవీన్. అయితే ఆ తర్వాత కొన్ని ఫ్లాఫ్ లు ఎదురవ్వడంతో సినిమాలు బాగా తగ్గించేశాడు. దీనికి తోడు వైవాహిక బంధంలోనూ సమస్యలు తలెత్తాయి. ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరితో ( రామకృష్ణ కూతురు) విడిపోయాడు. ఆ తర్వాత రెండో వివాహం కూడా చేసుకున్నాడు. ఇప్పుడు వడ్డే నవీన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కొడుకు ధోతీ ఫంక్షన్ వేడుకలు నిర్వహించగా.. చిరంజీవి, రోజా, శ్రీకాంత్, రాశి వంటి తదితరులు హాజరయ్యారు. ఇక 2016లో రిలీజైన మంచు మనోజ్ ఎటాక్ సినిమాలో చివరిగా కనిపించాడు నవీన్. సినిమాలకు దూరంగా ఉంటోన్న అతను ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కొన్నేళ్ల క్రితం జరిగిన వడ్డే నవీన్ కుమారుడి ధోతి ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు..

Vadde Naveen

Vadde Naveen, Chiranjeevi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.