Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు బాగా ఫేమస్.. మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్

సినిమా ఇండస్ట్రీలోనూ ఆమెక సంబంధాలున్నాయి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆమెకు స్వయానా పెద్ద నాన్న అవుతారు. అలాగే ఆలీ, ఎంఎస్ రాజు, మాధవీలత తదితర సినీ ప్రముఖులతోనూ ఆమెకు పరిచయాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల నోట్లో ఆమె పేరు బాగా నానుతోంది

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు బాగా ఫేమస్.. మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్
Bigboss Telugu 8 Contestant
Follow us
Basha Shek

|

Updated on: Sep 09, 2024 | 8:27 PM

ఈ ఫొటోలో చిరునవ్వులు చిందిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె బాగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది. సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్, యూట్యూబర్, యాక్టర్, యాంకర్, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు.. ఇలా అన్ని రంగాల్లోనూ తన ట్యాలెంట్ చూపించారు. సినిమా ఇండస్ట్రీలోనూ ఆమెక సంబంధాలున్నాయి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆమెకు స్వయానా పెద్ద నాన్న అవుతారు. అలాగే ఆలీ, ఎంఎస్ రాజు, మాధవీలత తదితర సినీ ప్రముఖులతోనూ ఆమెకు పరిచయాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బుల్లితెర ప్రేక్షకుల నోట్లో ఆమె పేరు బాగా నానుతోంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగు పెట్టిన ఆమె దురదృష్టవశాత్తూ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ బెజవాడ బేబక్క అలియాస్ మధు, మాధవి నెక్కంటి. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ నేపథ్యంలో బేబక్కకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

బెజవాడ బేబక్క అసలు పేరు మాధవి నెక్కంటి. ఆమెది విజయవాడ అయినప్పటికీ ఎక్కువగా అమెరికాలోనే ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. స్థానిక పరిస్థితులపై బేబక్క చేసే రీల్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. బేబక్క గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆమె పాప్ సింగర్ కూడా. పలు పాప్ సాంగ్స్ చేసింది. అతే కాదు ఆమె పలు చిత్రాల్లో నటించారు . అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, 24 కిసెస్, మళ్లీ పెళ్లి వంటి దాదాపు 20 సినిమాల వరకు చేశారు. మళ్లీ పెళ్లి సినిమాలోనూ మెరిశారు.ఇక శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షూట్‌-అవుట్‌ ఎట్‌ అలేర్‌ వెబ్ సిరీస్ లోనూ కీలక పాత్రలో నటించి మెప్పించారు. దర్శక కేంద్రుడు రాఘవేంద్ర రావు తనకు పెద్ద నాన్న వరుస అవుతారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బేబక్క. వీటన్నిటినీ పక్కన పెడితే బేబక్క విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. బేబక్క ఫౌండేషన్ పేరుతో గతంలో పాఠశాలలకు టీవీల పంపిణీ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో బేబక్క..

వారం రోజులోనే ఎన్నో జ్ఞాపకాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.