AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saripodhaa Sanivaaram OTT: అప్పుడే ఓటీటీలోకి నాని సరిపోదా శనివారం! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

దసరా, హాయ్ నాన్న వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి నానితో జత కట్టింది ప్రియాంక అరుళ్ మోహన్.

Saripodhaa Sanivaaram OTT: అప్పుడే ఓటీటీలోకి నాని సరిపోదా శనివారం! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Saripodhaa Sanivaaram Movie
Basha Shek
|

Updated on: Sep 08, 2024 | 11:30 AM

Share

దసరా, హాయ్ నాన్న వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా నటించాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి నానితో జత కట్టింది ప్రియాంక అరుళ్ మోహన్. అలాగే అంటే సుందరానికి తర్వాత నాని- వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. టైటిల్, పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్ తో రిలీజ్ కు ముందే సరిపోదా శనివారం సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా నాని సినిమాకు మాత్రం వసూళ్ల వర్షం ఆగడం లేదు. ముఖ్యంగా సినిమాలో నాని – ఎస్ జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. ఇక బీజీఎమ్ కూడా సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. నాని సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుందట. సరిపోదా శనివారం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత సినిమా ఓటీటీ లోకి రావాలని నిబంధనలు ఉన్నాయి. కానీ సరిపోదా శనివారం మూవీ విషయంలో మాత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేలా డీల్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే సెప్టెంబర్ 27వ తేదీ నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం నాని సినిమాకు కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా ఇప్పుడు పోటీగా పెద్ద సినిమాలు కూడా లేవు. కాబట్టి సరిపోదా శనివారం మరికొన్ని రోజుల పాటు ఇదే రన్ ను కొనసాగించవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఆలస్యం అవ్వచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..