AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAY OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ బావమరిది సూపర్ హిట్ సినిమా.. ‘ఆయ్ ‘అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదిగో..

'మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మ్యాడ్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న నార్నే నితిన్ 'ఆయ్ ' అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అంజి కె మణిపుత్ర తెరకెక్కంచిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించింది.

AAY OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ బావమరిది సూపర్ హిట్ సినిమా.. 'ఆయ్ 'అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదిగో..
Aay Movie
Basha Shek
|

Updated on: Sep 07, 2024 | 2:46 PM

Share

‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మ్యాడ్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న నార్నే నితిన్ ‘ఆయ్ ‘ అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అంజి కె మణిపుత్ర తెరకెక్కంచిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘ఆయ్‌’ సూపర్ హిట్ గా నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ సుమారు రూ. 20 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఆయ్ సినిమా ఈ కలెక్షన్లు రాబట్టడం విశేషం. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ స్వచ్చమైన ప్రేమకథను చూసి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రష్మిక మందన్న తదితర సినీ ప్రముఖులు ఆయ్ సినిమా టీమ్ ను మెచ్చుకున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సందడి చేస్తున్న ఆయ్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా ఆయ్ సినిమా ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్‌ 12 నుంచి ఆయ్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ‘ఊరిలో వెదవలు అంటే.. ఫస్ట్ అనుకునేది వీళ్లనే. ఆయ్.. వీళ్లు ఫ్రెండ్స్ అండి.. సెప్టెంబర్ 12 నుంచి ఆయ్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది’ అని సినిమా పోస్టర్ ను పంచుకుంది నెట్ ఫ్లిక్స్. ఆయ్ సినిమా విజయానికి మరో ప్రధాన కారణం పాటలు. ఈ సినిమాకు రామ్ మిరియాల అందించిన స్వరాలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా రంగనాయకి సాంగ్ కు యూట్యూబ్ షేక్ అవుతోంది. అలాగే సూఫియానా, డైవర్షన్ బ్యూటీ సాంగ్స్ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి థియేటర్లలో ఆయ్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఒక 5 రోజులు ఆగండి. ఎంచెక్కా ఓటీటీలోకే వస్తోంది.

సెప్టెంబర్ 12నుంచి స్ట్రీమింగ్..

ఆయ్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us