Bigg Boss Telugu 8: విగ్గు విషయంలో నాగ మణికంఠను ఆ స్టార్ హీరోతో పోల్చిన గీతూ రాయల్.. ఫ్యాన్స్ వార్నింగ్
హౌస్ లో నిత్యం ఏడుపు ముఖంతోనే కనిపిస్తోన్న అతను ట్రాన్స్ పరేంట్ ఉంటున్నానంటూ తన విగ్గు తీసి పక్కన పెట్టాడు. దీంతో అతనిపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. అయితే ఈ విషయంలో నాగమణికంఠకు సపోర్ట్ చేస్తూ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ వచ్చి అప్పుడే వారం పూర్తి కావోస్తోంది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ లో పెద్దగా పాపులరైన కంటెస్టెంట్స్ లేరు అన్న టాక్ వినిపిస్తోంది. ఉన్నంతలో కాస్త విష్ణుప్రియ మాత్రమే కాస్త పరిచయమున్న ఫేస్. కంటెస్టెంట్స్ ఎలా ఉన్నా.. బిగ్ బాస్ హౌస్ ఆటతీరు మాత్రం మారలేదు. కంటెస్టెంట్స్ మొదటి రోజు నుంచే గొడవలు పడుతున్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నాగ మణికంఠ అయితే సింపతీ గేమ్ ఆడుతున్నాడనిపిస్తోందిని ఆడియెన్స్ విమర్శిస్తున్నారు. హౌస్ లో నిత్యం ఏడుపు ముఖంతోనే కనిపిస్తోన్న అతను ట్రాన్స్ పరేంట్ ఉంటున్నానంటూ తన విగ్గు తీసి పక్కన పెట్టాడు. దీంతో అతనిపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. అయితే ఈ విషయంలో నాగమణికంఠకు సపోర్ట్ చేస్తూ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ విషయంలోకి టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో పేరును లాగడంతో గీతూను ఆడేసుకుంటున్నారు అభిమానులు, నెటిజన్లు..
వీడియోలో ఏముందంటే..
‘బిగ్‌బాస్ హౌస్‌లో నాగమణికంఠ విగ్ తీసి పక్కన పెట్టేసి చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే అతను మానసికంగా సరిగ్గా లేడనిపిస్తోంది. కానీ చాలామంది రివ్యూవర్లు అతని విగ్గు తీసి పక్కన పెట్టడంపై వెటకారంగా మాట్లాడుతున్నారు. నెట్టింట కూడా భారీగా మణికంఠను ట్రోల్స్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. సినిమా ఇండస్ట్రీలో ఉండేటప్పుడు టీవీలో అందరికీ కనిపించేటప్పుడు తాము అందంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. తనకి కొంచెం హెయిర్ లేకపోవడంతో ఆ విగ్గు పెట్టుకున్నాడు. అందులో తప్పేముంది. కానీ దాన్ని చాలామంది కామెడీ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో కూడా హెయిర్ తక్కువుగా ఉందని ట్రాన్స్‌ప్లెంటేషన్ చేయించుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందరూ అందంగా కనిపించాలనుకున్నప్పుడు అలాగే చేస్తారు. నాగ మణికంఠ కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో విగ్గు పెట్టుకున్నాడు. దాన్ని కూడా కామెడీ చేస్తే మానవత్వం లేనట్లే’ అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్.
గీతూ రాయల్ షేర్ చేసిన వీడియో ఇదిగో..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
గీతూ రాయల్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది. అంతా బాగానే ఉన్నా సంబంధంలేని విషయంలోకి ఒక స్టార్ హీరోను లాగడం పై అతని అభిమానులు గీతూపై మండి పడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వార్నింగ్ ల ఇస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.