- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Couple Rocking Rakesh And Jordar Sujatha visit Isha Foundation ahead of her baby delivery
Rocking Rakesh: ‘శివయ్య ఆశీస్సుల కోసం’.. ఆధ్యాత్మిక యాత్రలో జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, సుజాత.. ఫొటోస్
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య జబర్దస్ నటి, జోర్దార్ సుజాత త్వరలోనే ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. కాగా బిడ్డ పుట్టే ముందు బెంగళూరులోని ఈషా ఫౌండేషన్ ను దర్శించుకున్నారీ జబర్దస్త్ కపుల్.
Updated on: Sep 05, 2024 | 7:07 PM

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య జబర్దస్ నటి, జోర్దార్ సుజాత త్వరలోనే ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. కాగా బిడ్డ పుట్టే ముందు బెంగళూరులోని ఈషా ఫౌండేషన్ ను దర్శించుకున్నారీ జబర్దస్త్ కపుల్.

భార్య సుజాతతో కలిసి ఈషా ఫౌండేషన్ కు వెళ్లాడు రాకింగ్ రాకేష్. అక్కడ శివుని దీవెనలు తీసుకున్నారు. ఆ తర్వత భారీ విగ్రహం ముందు సరదాగా ఫొటోలు దిగారీ లవ్లీ కపుల్.

అనంతరం తమ పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు రాకింగ్ రాకేశ్, సుజాత. 'ఆ శివుడి ఆశీస్సులతో నీ రాక కోసం' అంటూ తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు 'మీకు అంతా మంచే జరగాలి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత జోడీ ఒకటి. ఇదే వేదికపై తమ కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ జంట నిజ జీవితంలోనూ కపుల్ గా మారారు.

ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ క్యూట్ కపుల్. ఇటీవలే సుజాత సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు.