Tollywood: పవన్ కల్యాణ్‌ పక్కన ఉన్న ఈ బక్కపల్చని అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఫేమస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పవన్ ను అమితంగా అభిమానిస్తారు. పై ఫొటోలో పవన్ పక్కన బక్కపల్చగా ఉన్న అబ్బాయి కూడా సరిగ్గా ఆ కోవకే చెందుతాడు. పవన్ కల్యాణ్ ను విపరీతంగా అభిమానించే టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఇతను కూడా ఒకరు.

Tollywood: పవన్ కల్యాణ్‌ పక్కన ఉన్న ఈ బక్కపల్చని అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఫేమస్
Pawan Kalyan
Follow us

|

Updated on: Sep 05, 2024 | 7:38 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పవన్ ను అమితంగా అభిమానిస్తారు. పై ఫొటోలో పవన్ పక్కన బక్కపల్చగా ఉన్న అబ్బాయి కూడా సరిగ్గా ఆ కోవకే చెందుతాడు. పవన్ కల్యాణ్ ను విపరీతంగా అభిమానించే టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఇతను కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సృయంకృషిని నమ్ముకుని పైకొచ్చిన వారిలో ఇతను కూడా ఒకడు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొన్నాడు. కానీ వెనకడుగు వేయలేదు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీతో మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన హుషారైన, దుమ్మురేపే స్టెప్పులతో స్టార్ హీరోలకు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు. కేవలం టాలీవుడ్ హీరోలకే కాదు కన్నడ, తమిళ్, బాలీవుడ్ హీరోలకు కూడా కొరియోగ్రఫీ చేశాడు. ముఖ్యంగా మెగా హీరోలకు ఫేవరెట్ డ్యాన్స్ మాస్టర్. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా మారిన అతను మరెవరో కాదు జానీ మాస్టర్. ఇక పై ఫొటో విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ నటించిన బాలు సినిమా సెట్ లోనిది.

ఇవి కూడా చదవండి

2009 నితిన్‌ నటించిన ద్రోణ సినిమాతో డ్యాన్స్‌మాస్టర్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జానీ మాస్టర్. ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో రచ్చ, నాయక్‌, ఎవడు, రంగస్థలం, అల్లు అర్జున్‌తో జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అలా వైకుంఠ పురంలో, యంగ్‌ టైగర్‌తో ఎన్టీఆర్‌తో బాద్షా, టెంపర్‌, నాన్నకు ప్రేమతో అరవింద సమేత వీర రాఘవ, రామ్‌ పోతినేనితో ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి ఎన్నో హిట్‌ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. తమిళంలో దళపత విజయ్‌, కన్నడలో సుదీప్‌ కిచ్చా , బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ తదితర స్టార్‌ హీరోలతోనూ వర్క్‌ చేశారు జానీ మాస్టర్ . ఇక పవన్ కల్యాణ్ అమితంగా అభిమానించే ఈ డ్యాన్స్ మాస్టర్ జనసేనలో చేరారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ తరఫున విస్త్రుతంగా ప్రచారం కూడా నిర్వహించారు.

పవన్ పుట్టిన రోజున రక్తదాన కార్యక్రమంలో జానీ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.