AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: యోగా చేస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? క్రేజీ హీరోయినే కాదు రఫ్పాడించే కిక్ బాక్సర్ కూడా

పై ఫొటోలో కళ్లు మూసుకుని యోగసనాలు వేస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ లోనూ బాగా ఫేమస్. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే ఈ అమ్మడు ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్‌లోనూ దుమ్ము రేపింది. అయితే చూపులతో కవ్వించే ఈ హీరోయిన్..

Tollywood: యోగా చేస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? క్రేజీ హీరోయినే కాదు రఫ్పాడించే కిక్ బాక్సర్ కూడా
Tollywood Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Sep 04, 2024 | 7:12 PM

Share

పై ఫొటోలో కళ్లు మూసుకుని యోగసనాలు వేస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ లోనూ బాగా ఫేమస్. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే ఈ అమ్మడు ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్‌లోనూ దుమ్ము రేపింది. అయితే చూపులతో కవ్వించే ఈ హీరోయిన్ ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ కూడా. చిన్నతనం నుండి కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా పొందింది. సూపర్ ఫైట్ లీగ్‌లో కూడా పాల్గొంది. అయితే తానొకటి తలిస్తే.. దైవం మరోటి తలచిందని.. గొప్ప కిక్ బాక్సర్ గా ఎదగాల్సిన ఈ అమ్మాయి అనూహ్యంగా నటిగా మారిపోయింది. తనదైన అందం, అభినయంతో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈ క్యూటీ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్.. తను మరెవరో కాదు గురు సినిమాలో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి నటించిన హీరయిన్ రితికా సింగ్. ఇది ఆమె చిన్నప్పటి ఫొటో. సుధా కొంగర తెరెక్కించిన సాలా ఖదూస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రితికా సింగ్. ఇందులో మాధవన్ హీరోగా నటించాడు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ఇదే సినిమా తమిళంలో ఇరుడి సుట్రు పేరుతో రీమేక్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సాలా ఖదూస్ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా గురు పేరుతో తెరకెక్కించారు సుధా కొంగర. హీరో మారినా రితికా సింగ్ నే హీరోయిన్ గా నటించింది. ఇక్కడ కూడా ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది. ఇలా ఒకే సినిమాతో మూడు ఇండస్ట్రీలను చుట్టేసింది రితికా సింగ్. దీని విజయ్ సేతుపతి‌తో కలిసి ఆండవన్ కట్టలై, అలాగే రాఘవ లారెన్స్ సరసన శివలింగ సినిమాల్లో నటించిందీ అందాల తార. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అయితే గురు తర్వాత నేరుగా మరే తెలుగు సినిమాలోనూ నటించలేదీ ముద్దుగుమ్మ. కేవలం నీవెవ్వరో సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం రజనీకాంత్ వెట్టియాన్ సినిమాలో నటిస్తోంది రితికా సింగ్. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫజిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్ల కూడా నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే వర్కౌట్లకు అభిమానులు, నెటిజన్లు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

జిమ్ లో వర్కౌట్స్ చేస్తోన్న రితికా సింగ్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Ritika Singh (@ritika_offl) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!