Tollywood: ఈ ఫొటోలోని హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఆ టాలీవుడ్ యంగ్ హీరో భార్య.. అసలు ఊహించలేదుగా

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో నిలిచిందీ అందాల తార. లక్షల జీతం ఇచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చింది

Tollywood: ఈ ఫొటోలోని హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఆ టాలీవుడ్ యంగ్ హీరో భార్య.. అసలు ఊహించలేదుగా
Tollywood Actress
Follow us

|

Updated on: Sep 04, 2024 | 8:48 PM

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో నిలిచిందీ అందాల తార. లక్షల జీతం ఇచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చింది. చివరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ఖాతాలో వేసుకుంది. తన మొదటి సినిమాలో స్క్రీన్‌ షేర్ చేసుకున్న హీరోతోనే ఇప్పుడు జీవితం పంచుకుంది. ఇటీవల మూడు ముళ్ల బంధంతో జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్. ఇటీవలే కర్ణాటకలోని కూర్గ్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికీ వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. రహస్య అసలు పేరు ఐశ్వర్య గోరక్. మనందరికి తెలిసింది ఏంటంటే.. ఈ నటి రాజా వారు రాణిగారు సినిమాలో మాత్రమే నటించిందని. అయితే 2012 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆమె పలు సినిమాల్లో నటించిందన్న విషయం చాలా మందికి తెలియదు.

2012లో మంచు విష్ణు, హన్సిక హీరో హీరోయిన్లుగా వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ దేనికైనా రెడీ మూవీలో ఓ స్మాల్ రోల్ చేసింది రహస్య. ఇందులో హీరో మంచు విష్ణుకి కాలేజీ క్లాస్ మేట్‌గా నటించింది. ఆ తర్వాత హ్యాపీ ఎండింగ్, ఆకాశమంత వంటి షార్ట్ ఫిల్మ్స్ చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రమంలో 2017లో వచ్చిన రెండు రెళ్లు ఆరు చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది రహస్య. పై ఫొటో ఆ సినిమాలోనిదే. సాయి ధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన తేజ్ ఐలవ్ యూలో కూడా నటించింది రహస్య. కానీ చిన్న పాత్రలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కిరణ్ అబ్బవరంతో కలిసి నటించిన రాజు వారు రాణి గారు సినిమాతో బాగా క్రేజ్ తెచ్చుకుంది. దీని తర్వాత తమిళంలో కూడా కదిర్ హీరోగా వచ్చిన ఓ మూవీలో యాక్ట్ చేసింది రహస్య. దీని తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదీ అందాల తార. ఇప్పుడు తన మొదటి హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి ఫొటోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..