AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nindha OTT: ఓటీటీలోకి వరుణ్ సందేశ్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. ‘నింద’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాథం తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో రాజ‌న్న ఫేమ్ అనీ, క్యూ మ‌ధు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన నాంది సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిం

Nindha OTT: ఓటీటీలోకి వరుణ్ సందేశ్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. 'నింద' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ninda Movie
Basha Shek
|

Updated on: Sep 04, 2024 | 8:16 PM

Share

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాథం తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో రాజ‌న్న ఫేమ్ అనీ, క్యూ మ‌ధు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన నాంది సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే చిన్న సినిమా అ న్న ట్యాగ్ ఉండడం, ప్రమోషన్లు కూడా ఎక్కువగా నిర్వహించడంతో నింద లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. సినిమాలోని కథ, కథనాలు, ట్విస్టులతో వరుణ్ సందేశ్ నటన బాగుందని ప్రశంసలు, రివ్యూలు వచ్చాయి. టేకింగ్ పరంగా ఆడియెన్స్ మెప్పు పొందిన నింద మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి నింద సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్. ‘మంచోడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టే.. సెప్టెంబర్ 6న ఈటీవీ విన్‍లో నింద ప్రీమియర్’ అంటూ తమ సోషల్ మీడియా ఖాతాలో వరుణ్ సందేశ్ మూవీ పోస్టర్ ను పంచుకుంది.

ఇవి కూడా చదవండి

నింద సినిమాలో వరుణ్ సందేశ్‍తో పాటు యానీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై కీలకపాత్రలు పోషించారు. ఓ హత్య కేసులో విచారణ విషయంలో పోలీస్ ఆఫీసర్లను, డాక్టర్‌ను హీరో కిడ్నాప్ చేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. నింద చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందించగా.. రమీజ్ నవ్‍వీత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. . దర్శకుడు రాజేష్ జగన్నాథం ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరించారు.

ఎల్లుండి నుంచే ఈటీవీ విన్ లో నాంది సినిమా స్ట్రీమింగ్..

కాగా వరుణ్ సందేశ్ నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..