- Telugu News Photo Gallery Cinema photos Tollywood Celebrities Ganesh Chaturthi Celebrations, Photos Here
Ganesh Chaturthi: వరుణ్ ఇంట్లో ఇలా.. బన్నీ ఇంట్లో అలా.. సినీ తారల వినాయక చవితి వేడుకలు.. ఫొటోస్
దేశవ్యాప్తంగా వినాయక చవితి (సెప్టెంబర్ 07) వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ‘బోలో గణపతి బప్పా మోరియా’ అనే భక్తుల నినాదాల మధ్య బొజ్జ గణపయ్యలు మండపాల్లో పూజలందుకుంటున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Updated on: Sep 07, 2024 | 3:56 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితి (సెప్టెంబర్ 07) వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ‘బోలో గణపతి బప్పా మోరియా’ అనే భక్తుల నినాదాల మధ్య బొజ్జ గణపయ్యలు మండపాల్లో పూజలందుకుంటున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లోనూ గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. బన్నీ గారాల పట్టి అల్లు అర్హ ఇంట్లో గణపతి పూజా చేయడం విశేషం.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంట్లోనూ గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి సంప్రదాయ చీరలో మెరిసిపోయింది.

యంగ్ హీరోలు శర్వానంద్, ఆది సాయి కుమార్ తమ ఇళ్లల్లో జరిగిన వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఇక బుల్లితెర సెలబ్రిటీలైన యాంకర్ లాస్య, ముక్కు అవినాశ్, యాంకర్ శ్యామల ఇళ్లలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

సోనాలి బింద్రే, అనన్యా పాండే తదితర బాలీవుడ్ సెలబ్రిటీలు వినాయక చవితిని ఘనంగా చేసుకున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.