Game Changer: ఒక్క అప్‌డేట్ ప్లీజ్.. ఒకేఒక్క అప్‌డేట్ ప్లీజ్.. అంటున్న చెర్రీ ఫ్యాన్స్.!
ఒక్క అప్‌డేట్ ప్లీజ్.. ఒకేఒక్క అప్‌డేట్ ప్లీజ్ అంటున్నారు రామ్ చరణ్ అభిమానులు. గేమ్ ఛేంజర్ టీం మాత్రం ఇప్పటి వరకు కరెక్టుగా స్పందించింది కూడా లేదు. ఏదో అప్పుడప్పుడూ తమన్ ఒక్కడే నేనున్నానంటూ కాస్త రియాక్ట్ అవుతున్నారు. వినాయక చవితికి అప్‌డేట్ మళ్లీ ఊరించారీయన. మరి గేమ్ ఛేంజర్ నుంచి ఏం రాబోతుంది.? ఆ సర్‌ప్రైజ్ ఏంటి..? గేమ్ ఛేంజర్ సినిమాకు ముహూర్తం పెట్టి దాదాపు మూడేళ్ళవుతుంది. నమ్మడానికి చిత్రంగా అనిపించినా ఇదే నిజం.